చెరకు రసం బిజినెస్ | Cheruku Rasam | What is the profit margin in a sugar cane juice business | Local Small Business idea

ఏదొక బిజినెస్ చేసి స్వయం ఉపాధి పొందుతూ డబ్బు సంపాదించడానికి  అనేక మార్గాలు ఉన్నాయి. అలాంటి ఒక వ్యాపారమే "చెరకు రసం" బిజినెస్. కొన్నేళ్ల క్రితం చెరుకు రసం తయారు చేయాలంటే ఒక రకమైన యంత్రంలో చెరుకు గడలను పెట్టి చేతులతో దాన్ని తిప్పవలసి వచ్చేది. అంతేకాకుండా కూల్ గా ఉండడానికి చెరుకు రసంలో ఐస్ వేసేవారు. అయితే ఆ ఐస్ వేయడం వల్ల చాలామందికి నచ్చేది కాదు. 
ఇప్పుడు అలాంటి కష్టాలు ఏమి లేకుండా కేవలం ఒక్క మెషిన్ ద్వారానే చక్కనైన చెరుకు రసం తయారు చేసి సేల్ చేసుకోవచ్చు. కాలంతో సంబంధం లేకుండా అందరూ ఈ చెరుకు రసాన్ని ఇష్టపడతారు కాబట్టి, ఈ వ్యాపారం సులువు మరియు లాభదాయకం కూడా. అయితే ఈ వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందడానికి వేసవికాలంలో ప్రారంభించడం మంచిది. ఇక ఈ వ్యాపారం గురించి అన్ని విషయాలను తెలుసుకుందాం.