August 22, 2019

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర

కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లా లోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలేగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరు జయరామిరెడ్డి. విజయనగర రాజుల కాలం నుంచి పాలన సాగిస్తున్న ఈయన మన్రో హయాంలో బ్రిటీషువారిని ఎదురించి బంధీ అయ్యాడు. నొస్సం సంస్థానం బ్రిటీషువారి వశమైంది. ఆయనకు భరణం ఏర్పా టు చేశారు. జయరామిరెడ్డి కొడుకుకు సంతానం లేకపో వడంతో, అతని సోదరి కుమారుడు ఉయ్యాలవాడ నర సింహారెడ్డికి భరణం అందేది. ఆయనకు బ్రిటీషు వారి నుంచి నెలకు రూ.11 భరణం అందేది. ఆయన జన్మించింది రూపనగుడిలో. పెరిగింది ఉయ్యాలవాడలో. భరణం అందుకుంటూ ఉంటున్నది నొస్సం కోటలో. పరిపాలించే అధికారం లేకపోయినా జయరామిరెడ్డి వంశీయుల ప్రభావం ఆ ప్రాంతంలో ఏమాత్రం తగ్గలేదు. ప్రజలు వారి కుటుం బాన్ని గౌరవభావంతో, ఆదరాభిమానాలతో చూసేవారు. అప్పటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వయసు సుమారు నలభై ఏళ్లు.


వంశానుసారంగా అందాల్సిన భరణం విషయంలో జరిగిన ఓ చిన్న సంఘటన నరసింహారెడ్డిలోని ఆత్మాభి మానాన్ని దెబ్బతీసింది. తన ప్రాంతంపై పెత్తనం చెలా యిస్తూ, దేశాన్ని కొల్లగొడుతున్న బ్రిటీషు వారిపట్ల ఆయ నకు అప్పటికే ఉన్న కోపం, కసి, పగ, ద్వేషం తారా స్థాయికి చేర్చింది. నాటి కోవెలకుంట్ల తహసీల్దారు రాఘవాచారి నరసింహారెడ్డికి చెల్లించాల్సిన భరణం విషయంలో అవహేళనగా మాట్లాడి ఆయనలో కోపావేశాలు పెరిగేలా చేశాడు. నరసింహారెడ్డి పంపిన అనుచరుడితో ‘ముష్టి తీసుకునే వాడికి మరోక ముష్టివాడా..? అతను బ్రిటీషు వారి నుంచి భరణం తీసుకుంటూ బ్రిటీషు వారికి శిస్తు కట్టొద్దని చెబుతున్నాడట. ఆ ముష్టివాడినే రమ్మను.. ఇస్తా భరణం’ అని చెప్పి పంపడంతో నర సింహారెడ్డిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఏకంగా ‘ట్రెజరీనే కొల్లగొల్లడతాను. నీ ప్రాణాలు తీస్తాను. చేతనైతే రక్షించుకో..’ అంటూ లేఖరాసి పంపిం చాడు. దీంతో తహసీల్దారు అప్రమత్తమై, ట్రెజరీలోనే ఉండిపోయాడు.
రక్షణగా కొంత బ్రిటీషు సైన్యాన్ని ఏర్పా టు చేసుకున్నా... నరసింహారెడ్డి చెప్పిన మాట ప్రకారం 1846 జూలై 10న మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన అనుచరులతో దాడి చేశాడు. తనను అవహేళనగా మాట్లాడిన తహసీల్దారు రాఘవాచారి శిరస్సు ఖండించాడు నరసింహారెడ్డి. ట్రెజరీ అధికారి థామస్‌ ఎడ్వర్టుకి గుండుగీయించి, ‘నీ బ్రిటీషు అధికారు లకు దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నయనాలప్ప వద్ద నన్ను కలుసుకోమను’ అని చెప్పి, ఎనిమిది వందల అయిదు రూపాయల పది అణాల నాలుగు పైసలను కొల్లగొట్టుకెళ్లి బ్రిటీషు సైన్యానికి సవాలు విసిరాడు.


తహసీల్దార్‌ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపిన విషయం తెలుసుకున్న నాటి కడప కలెక్టర్‌ కాక్రేన్‌ కోపం తారాస్థాయికి చేరింది. వెంటనే సైన్యాన్ని తీసుకొని నొస్సం కోటపై దాడి చేయాలని బళ్లారిలోని బ్రిటీషు బ్రిగేడియర్‌ జనరల్‌ వాట్సన్‌ను ఆదేశించాడు. 1846 జూలై 23న బ్రిటీషు సైన్యం నొస్సం కోటపై దాడికి వచ్చింది. కానీ నరసింహారెడ్డి తెలివితేటల ముందు బ్రిటీష్‌ సైన్యం మట్టికరిచింది. ప్రాణభయంతో పారిపోతున్న వాట్సన్‌ తలను ఒక్కవేటు తో నరికేశాడు నరసింహారెడ్డి.


వాట్సాన్ మరణం తరువాత కర్నూలులో తుంగభద్ర నదీ తీరం వద్ద ఉన్న బ్రిటీషు ప్రభుత్వ తాలుకా కార్యాలయంలో కడప కలెక్టర్‌ కాక్రేన్‌ అధ్యక్షతన వాట్సన్‌ స్థానంలో నియమితుడైన కెప్టెన్‌ నార్టన్‌, కర్నూలు కెప్టెన్‌ రసెల్‌, మిలిటరీ కమాండింగ్‌ ఆఫీసర్‌ జోసఫ్‌, గవర్నర్‌ ఏజెంట్‌ డానియెల్‌ సమావేశ మయ్యారు. నరసింహారెడ్డిని ఒక్కడిని చేసి పట్టుకోవాల ని, అతని తలపై రూ.10 వేలు బహుమతి ప్రకటించి ప్రజల్ని ప్రలోభపర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించు కున్నారు.


రాజద్రోహి నరసింహారెడ్డి స్థావరం, ఆచూకి తెలిపిన వారికి రూ.5 వేలు బహుమానం, అతన్ని సజీ వంగా లేదా నిర్జీవంగా పట్టి తెచ్చినవారికి రూ.10 వేలు బహుమానం కలెక్టర్‌ కాక్రెన్‌ దొరవారు ఇస్తారు. వీరులై న వారు నరసింహారెడ్డిని పట్టిచ్చి బహుమానం అందు కోండహో’’.. అంటూ తప్పెటతో చాటింపు వేయించారు.నరసింహారెడ్డిని ధైర్యంగా ఎదుర్కోవడం, యుద్ధ విద్యలతో పట్టుకోవడం సాధ్యం కాదని బ్రిటీష్‌ అధికారు లకు అర్థమైంది. ఏ ప్రజల కోసమైతే జీవిస్తున్నాడో వారిని హింసించడం ద్వారా నరసింహారెడ్డిని లొంగదీసు కోవచ్చని పన్నాగం పన్నారు. రెడ్డి ని ఆరాధించే 60 గ్రామాలపై సైనికుల దాడి జరిగింది. పిల్లాజెల్లా.., గొడ్డూ గోదా.. ఎవరినీ వదల్లేదు. అనుమా నం ఉన్న ప్రతివారిని పటు ్టకుని ‘నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పు’ అంటూ హింసించారు. కండకుష్టి గల యువకులను బంధీలుగా పట్టుకెళ్లారు. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఇవన్నీ తెలుసుకున్న నరసింహా రెడ్డి ప్రజలకోసం స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు.1846 అక్టోబర్‌ 6  న కలెక్టర్‌ కాక్రేన్‌ నరసింహారెడ్డి లొంగిపోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేశాడు. భయంకరమైన యుద్ధం లో  బ్రిటీష్‌ సైనికులు నరసింహారెడ్డిని బాగా గాయపరిచారు. దెబ్బతిన్న పులిని చివరకు సైన్యం పట్టుకుంది.
నరసింహారెడ్డిని విచారించిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది. జుర్రెటి ఒడ్డున ఉరి తీస్తున్నట్లు చాటింపు వేయించింది. రాయలసీమ వాసు లంతా తమ దొరను చివరిసారిగా చూసుకొనేందు కు కోయిలకుంట్లకు ప్రయాణం కట్టారు. ప్రతి పల్లె నుంచి జనం తరలివచ్చారు.


1847 ఫిబ్రవరి 22 తెల్లవారుజామున జైలు ద్వారం తెరుచుకుంది. బ్రిటిష్  సైనికుల వెంట ఒక్కో అడుగు వేస్తూ బయటకు వచ్చిన తమ పాలెగాడు నరసింహారెడ్డిని చూడగానే జనసంద్రం పొంగిపొర్లింది. నరసింహారెడ్డికి జై అంటూ నినాదాలు హోరెత్తాయి. నరసింహారెడ్డి కళ్లు చెమ్మగిల్లాయి. తన ఉద్యమం ఇంతటితో మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది అంటూ జుర్రెటి ఒడ్డుకు పదడుగుల దూరానా నిలువెత్తు పాతిన ఉరికొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మరణయాత్ర సాగించాడు. తిరుగుబాటుదార్లకు హెచ్చరికగా నరసింహా రెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుపసంకెళ్ల మధ్య వేలాడదీశాడు బ్రిటీష్‌ వారు. 1877 వరకు మూడు దశాబ్దాల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడుతూ ఉండిపోయింది. 

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge