IMG_20230619_202048

ఒకప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా మంచి అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు…. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్ గా స్థిర పడిపోతున్నారు. అందుకే యూట్యూబ్ ని ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారు

అయితే కంటెంట్ క్రియేట్ చేసే వాళ్లకు యూట్యూబ్ మరో శుభవార్త చెప్పింది. కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలంటే ముందుగా మానిటైజేషన్ కు అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం వెయ్యి మందికి పైగా సబ్స్క్రైబర్లు ఏడాదికి నాలుగు వేల గంటల వాచ్ టైం అర్హత కలిగి ఉండాలి. లేదంటే 90 రోజుల్లో టెన్ మిలియన్ షార్ట్ వీడియో వ్యూస్ ఉండాలి.

అయితే ఇప్పుడు ఈ నిబంధనను యూట్యూబ్ కాస్త సడలించింది. కొత్త నిబంధనల ప్రకారం మీ యూట్యూబ్ ఛానల్ మనిటైజ్ అవ్వాలంటే ఐదు వందల మంది సబ్స్క్రయిబర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్లోడ్ చేసి ఉండాలి. మరియు ఏడాదిలో 300 వాచ్ టవర్స్ లేదంటే చివరి 90 రోజుల్లో త్రీ మిలియన్ షార్ట్ వీడియో వ్యూస్ కలిగి ఉండాలి.

ఈ కనీస అర్హత సాధించిన వాళ్లు యూట్యూబ్ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు . అయితే ఈ కొత్త నిబంధనలను అమెరికా బ్రిటన్ కెనడా తైవాన్ దక్షిణ కొరియా లలో మాత్రమే ప్రారంభించారు. త్వరలోనే మిగిలిన దేశాల ను అమలు చేయనున్నారు

యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లు కూడా యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. దానితోపాటు సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్, సూపర్ థ్యాంక్స్, వంటి టిప్పింగ్ టూల్స్ తో పాటు ఛానల్ మెంబర్ షిప్ వంటి సబ్స్క్రయిబ్ ఆప్షన్ లను కూడా కల్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!