మన దృష్టిలో వైద్యం అంటే ఇప్పుడు మనం చూస్తున్నదే… రోగం ఏదైనా ఇప్పుడున్న సాంకేతికతతో శస్త్ర చికిత్స చేసిన వైద్యులు రోగాన్ని చిటికెలో నయం చేస్తారు అన్న ధైర్యం. అయితే పూర్వ కాలంలో వైద్యమంటే ఏముంది ఏవో పసరు ఆకులతో వైద్యం చేసే వాళ్ళు. పని చేస్తే రోగం నయమయ్యేది లేదంటే అంతే సంగతులు అని చాలా మంది అనుకుంటారు.
కానీ ఇప్పుడు మనం వింటున్న సర్జరీ అనే మాట శతాబ్దాల క్రితమే పుట్టింది. అది కూడా మన భారతావని లోనే.. ఔషధాలతో నయంకాని జబ్బును శస్త్రచికిత్స చేసి నయం చేసేవాడు ఒక మహా పురుషుడు ఆయనే సుశ్రుతుడు శస్త్రచికిత్సా అంటే ఏంటి? ఏ వ్యాధికి ఎలా చేయాలి?మొదలైన వివరాలన్నీ విడమరిచి మరీ ఆయన ఒక పుస్తకము రాశారు. అదే సుశ్రుత సంహిత. వైద్యం గురించి వివరించే చరకసంహిత ఆధారంగా సుశ్రుతుడు సుశ్రుత సంహిత రచించినట్లు తెలుస్తోంది.
సుశ్రుత సంహిత రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది పూర్వ తంత్ర రెండవది ఉత్తర తంత్ర. ఇవి మొత్తం 120 చాప్టర్లు. పూర్వ తంత్రలో మళ్లీ ఐదు భాగాలుంటాయి. అది సూత్ర స్థాన, విధాన స్థాన, శరీర స్థాన, చికిత్స స్థాన కల్ప స్థాన ఇలా ఐదు భాగాలుంటాయి. సూత్ర స్థాన లో మొత్తం 46 చాప్టర్ ఉంటాయి. ఇందులో ఆయుర్వేదం చరిత్ర , శస్త్రచికిత్సలో రకాలు, సర్జరీ కి ఎలాంటి వస్తువులు ఉపయోగించాలి, చికిత్స ఎలా చేయాలి, సర్జరీ తర్వాత పేషెంట్ కి ఎలాంటి చికిత్స అందించారు. శస్త్ర చికిత్స చేసిన చోట డ్రెస్సింగ్ ఎలా చేయాలి. ఆరోగ్యం, వైద్యం పై వాతావరణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మొదలైన వివరాలు ఉంటాయి. వీటితోపాటు సూత్ర స్థాన లో ఉన్న మరో ప్రత్యేకమైన అంశం నైతిక నియమాలు గురించి చెప్పడం.
అప్పట్లో సుశ్రుతుడు విద్యార్థులకు కూరగాయలు, జంతువుల మృతదేహాల పై ముందు సర్జరీ ప్రాక్టీస్ చేయించాడట. అందులో విద్యార్థులు మెలకువలు నేర్చుకున్న తర్వాత అప్పుడు మనుషులపై చేసేందుకు అంగీకరించేవాడు.
ఇక రెండవ భాగం నిదాన స్థాన… ఇందులో చర్మ వ్యాధులు, మూత్ర సంబంధిత వ్యాధులు, ఫ్రాక్చర్లు, గైనకాలజి, నాడీ సంబంధిత వ్యాధులు, నాడీవ్యవస్థ, గర్భిణీ ప్రసవం, పసికందులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నాలుక పెదాల ఇన్ఫెక్షన్లు మొదలైనవి వివరాలు ఈ నిదాన స్థాన లో పొందుపరిచారు.
శరీర స్థాన లో పురుషులు మహిళల జననాంగాలు వాటి పనితీరు, మహిళలు గర్భవతి అని తేల్చడానికి గుర్తించాల్సిన లక్షణాలు, కడుపులోని బిడ్డ అభివృద్ధి చెందే విధానం, శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, శరీరంలో రక్త ప్రవాహం ఎలా ఉంటుంది వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.
ఇక నాలుగు మరియు ఐదు భాగాలైన చికిత్స స్థాన మరియు కల్ప స్థానాల్లో చరకసంహిత లో ఉన్నట్లే .. స్వచ్ఛత, ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ రకాల విషాలు… వాటి విరుగుడు నివారణ మొదలైనవి ఉన్నాయి. శరీర స్థాన లో ఉన్న మరో ప్రత్యేకత మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో వివరించడం…
మనిషి శరీరంలో మూడువందల ఎముకలు ఉంటాయని సుశ్రుతుడు ఆ కాలంలోనే శరీర స్థాన లో పేర్కొన్నాడు. అలాగే పుట్టిన బిడ్డకు 300 ఎముకలు ఉంటాయని ఈ కాలం పరిశోధకులు కూడా నిర్ధారించారు.
అయితే కొన్నాళ్ళకు అవి కరిగిపోవడం వల్ల మనిషి పెరిగాక ఎముకల సంఖ్య 206 పరిమితమవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే….అయితే సుశ్రుతుడు ఎక్కువ పసికందుల శరీరాలు పరిశీలించడం వల్ల మనిషి పెరిగాక కూడా 300 ఎముకలు ఉంటాయని అంచనా వేసి ఉండొచ్చని విమర్శకులు పేర్కొంటున్నారు.
ఏది ఏమైనా విజ్ఞానానికి పెద్దగా ఆస్కారమే లేదని అందరూ భావించే ఆ కాలంలో మానవ శరీరం గురించి ఇంత క్షుణ్ణంగా తెలుసుకోవడం నిజంగా అద్భుతమే
ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు, సెలబ్రెటీలు అందంగా కనపడటానికి తమ ముక్కు సరిచేసుకోవడానికి సర్జరీ చేయించుకుంటున్నారని దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారు అని మన అందరం చెప్పుకుంటున్నాం. దాన్ని గురించి కూడా ఈ గ్రంథంలో సుశ్రుతుడు వివరించాడు ఈరోజుల్లో రినా ప్లేస్టి అని పిలిచే ఈ రకమైన సర్జరీ గురించి వివరంగా తన సుశ్రుత సంహిత లో చెప్పుకొచ్చాడు. ముక్కు మరింత అందంగా కనిపించేందుకు లేదా శ్వాస తీసుకోవడం మరింత సులభతరం చేసేందుకు ఈ సర్జరీ చేసే వారు.
ఆ కాలంలో ఎవరైనా నేరాలకు పాల్పడితే శిక్షగా వారి ముక్కును తొలగించేవారు. ముఖ్యంగా వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళ ఆరోపణలు ఎదుర్కొంటే ఆమెకు ఈ శిక్ష విధించే వారట. ఇలాంటి వారికి ఈ సర్జరీ ఎంతగానో ఉపయోగపడింది. అయితే ఈ సుశ్రుత సంహిత లోని ఆఖరి భాగాలను ఆ తర్వాత తరాలు పునరుద్ధరించాయి. ఈ పుస్తకం లోని చివరి భాగాలను అంటే పూర్వ తంత్ర ఆఖరి చప్టర్ లు సహా ఉత్తర తంత్ర కూడా సుశ్రుడి తర్వాత కాలంలో పునరుద్ధరించబడినవే…
ఈ ఉత్తర తంత్రంలో కన్ను ముక్కు చెవి భాగాలు తాలూకు జబ్బులు…వాటికి చేయాల్సిన చికిత్స మొదలైనవి ఉన్నాయి. సుశ్రుత సంహిత కు చెందిన అతి పురాతన తాళపత్ర గ్రంథాలు కొన్ని ప్రస్తుతం నేపాల్లోని ఖైసర్ లైబ్రరీలో ఉన్నాయి. ప్రస్తుతం మనకి తెలిసిన సుశ్రుత సంహిత ఆరో శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెప్తున్నారు.
ఈ పుస్తకానికి మూలమైన గురువు సుశ్రుతుడు ఏ శతాబ్దానికి చెందిన వాడు అనే దానిపై స్పష్టత లేదు అయితే చరక సంహితలో మరిన్ని వివరాలు జోడించిన ఆచార్య ద్రిద బాల కాలానికే సుశ్రుత సంహిత ఉందని అంటే సుశ్రుతుడు నాలుగు నుంచి ఐదు శతాబ్దాల ముందే జీవించి ఉండేవాడిని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు
క్యాబ్ వైద్య శాస్త్రంలోని ఎన్నో విషయాలను సుశ్రుత సంహిత ద్వారా భావితరాలకు తెలియజేసిన సుశ్రుతుడు కేవలం వైద్యుడే కాదు భారత దేశ తొలి సర్జన్ అని అనడంలో అతిశయోక్తి లేదేమో… అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ సర్జరీ గా పేర్కొంటారు.
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | వాట్సాప్ గ్రూప్ లింక్ |
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి | టెలిగ్రామ్ గ్రూప్ లింక్ |