స్వయం ఉపాధి కల్పించుకుని డబ్బు సంపాదించాలనుకునే వారికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని వ్యాపారాల గురించి నిజానికి చాలా మందికి తెలియదు. .. అలాంటి బిజినెస్‌లలో.. ఫ్యాబ్రిక్ రీసైక్లింగ్ అంటే వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్) బిజినెస్ కూడా ఒకటి. దీనికి తక్కువ పెట్టుబడి పెడితే చాలు.. పెద్ద ఎత్తున డబ్బు సంపాదించవచ్చు. ఇక కొద్దిగా మార్కెటింగ్ చేసుకోగలిగే ఓపిక ఉంటే.. ఈ బిజినెస్‌లో చాలా లాభాలు పొందవచ్చు. మరి ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో.. దీంట్లో ఎంత మొత్తం ఆదాయం లభిస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్‌కు రెండు రకాల మెషిన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకటి.. వేస్ట్ క్లాత్ గ్రైండింగ్ మెషిన్.. దీని సాధారణ మోడల్ ఖరీదు రూ.80వేల వరకు ఉంటుంది.