Raasi Phalalu

Today Rasi Phalalu | శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఈ రోజు రాశి ఫలాలు

మేషం
విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలహాలు సూచనలున్నవి.

వృషభం
ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిధునం
దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ విషయమై కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం
బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో ప్రయత్నం కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహం
అవసరానికి ధన సహాయం అందుతుంది. అనారోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

కన్య
ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల
బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. విద్యార్దులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు, ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం
ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన చికాకులు తప్పవు. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

ధనస్సు
ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మకరం
వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.

కుంభం
నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

మీనం
ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి తగిన గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.


మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

Leave a Comment

error: Content is protected !!