ఒకప్పుడు తిరుమల శ్రీవారిని భక్తులు చాలా దగ్గరగా దర్శించుకునే వారు. కులశేఖరుడి పడి దగ్గర ఉన్న గుమ్మం వరకు భక్తుల్ని అనుమతించేవారు. తర్వాత కాలంలో దర్శన విధానాలు మార్పులు చేసి కుదించారు. ఇప్పుడు మహాలఘు దర్శనం వల్ల చాలా చూడలేకపోతున్నాం
శ్రీవారి మూలవిరాట్టు దగ్గర నాలుగు విగ్రహాలు కనిపిస్తాయి వాటిలో కొన్నింటిని మాత్రం ఉత్సవాల సమయంలో బయటకు తీస్తూ ఉంటారు. చూడడానికి అవన్నీ ఒకే విగ్రహం అనుకునేలా కనిపిస్తాయి. కానీ అవన్నీ వేరువేరుగా ఉంటాయి. వెంకటేశ్వరుడి మూలవిరాట్ దగ్గర ఉండే 5 విగ్రహాల్లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం కూడా ఒకటి. ఈ విగ్రహం శ్రీవారి పాదాల దగ్గర ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం శ్రీవారి ఆలయాన్ని పునః నిర్మించినప్పుడు మూల విరాట్ కు బదులు వెండి తయారు చేయించిన రెండు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. కొంతకాలం భక్తులు ఈ స్వామిని దర్శించుకునేవారు. అందుకే ఆ విగ్రహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మూలవిరాట్టుకు ఈ విగ్రహానికి మధ్య తాడుతో కట్టిన బంధం ఒకటి ఉంటుంది. బుధవారం నాడు చేసే సహస్ర కలశాభిషేఖం కూడా ఈ విగ్రహానికి నిర్వహిస్తారు.
మూలవిరాట్టుకు ఎడమవైపు కొలువు శ్రీనివాసమూర్తి విగ్రహం ఉంటుంది. సుప్రభాత సేవ, అలంకరణ తర్వాత ఈ విగ్రహాన్ని స్వప్న మండపంలో బంగారు సిమ్హాసనంలో పెట్టి , మైసూరు మహారాజు వచ్చిన ఛత్రాన్ని ఉంచుతారు. స్వామివారి ఆలయానికి వచ్చిన ఆదాయం, ఖర్చుల వివరాలు, తిథులు, నక్షత్రాల గురించి స్వామికి చెబుతారు. మహారాజ పోషకుల పేర్లను స్వామి ముందు చదువుతారట. మూల విరాట్ కి కుడివైపు ఉండే విగ్రహం ఉగ్ర శ్రీనివాసమూర్తిది . భూదేవి, శ్రీదేవి తో కలిపి స్వామివారు ఈ విగ్రహంలో కనిపిస్తారు. 1330 కాలంలో జరిగిన ఉత్సవ సేవలన్ని ఈ విగ్రహానికి నిర్వహించేవారట. ఈ విగ్రహానికి సూర్యకిరణాలు తాకకూడదని స్వామి వారు చెప్పారట. ఈ విగ్రహాన్ని తెల్లవారుజామున రెండు, మూడు గంటల సమయంలో మాత్రమే బయటకు తెచ్చి మాడ వీధుల్లో ఊరేగించి, తిరిగి ఆలయం లోకి తీసుకెళ్ళిపోతారు. ఈ విగ్రహం గురించి వెంకటాచలపతీ వైభవం లో ఉంది.
1330 కాలంలో బ్రహ్మోత్సవాలు ఆగిపోయినప్పుడు వెంకటేశ్వరస్వామి సూచనలతో కొండపై తవ్వి తీసుకువచ్చిన మలయప్ప స్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారట. నాటి నుంచి ఇప్పటివరకూ ఆ విగ్రహం మూలవిరాట్ దగ్గరే ఉంచారు. మలయప్ప కొనలో దొరికిన ఈ విగ్రహాన్ని మలయప్పస్వామి అనే పేరుతో పిలుస్తారు. సహస్రదీపాలంకరణ సేవ లో వినియోగించేది ఈ విగ్రహాన్నే . ఇక ఆఖరిది మూలమూర్తి.. తోమాలసేవ, అర్చన, ఇలాంటి సేవలు ఈ మూలమూర్తికే నిర్వహిస్తారు