తమిళనాడులో పురాతన ఆలయాలకు లెక్కేలేదు వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆలయాలు లెక్కకు మించి ఉన్నాయి
అలాంటి వాటిలో ఒకటి తేన్ తిరుపతి…ముఖ్యంగా తిరుమల తిరుపతికి వెళ్ళలేని భక్తులు తేన్ తిరుపతికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.. సుమారు ఐదు వందల ఏళ్ల నాటి తిరు వెంగళ ముడియార్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ గుడిని తేన్ తిరుపతిగా కూడా భక్తులు పిలుస్తారు. కారణం తిరుమలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆలయాన్ని నిర్మించడం.
శ్రీవారి భక్తుల కోరిక మేరకు స్వామి ఆదేశానుసారం ఒక భక్తుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. స్వామి కలలో సూచించిన ప్రాంతంలో పెరుమాళ్ విగ్రహం దొరికింది కేవలం విగ్రహాన్ని ప్రతిష్టించడానికి లేదట. అందుకే శ్రీదేవి భూదేవి లతో ఆలయాన్ని స్థాపించారు
ఈ ఆలయ పనులు ప్రారంభించే ముందు తిరుపతి నుంచి శఠరీ, తిరుమయం నుంచి అగ్నిని తీసుకొచ్చారట. అందుకే ఈ ప్రాంతాన్ని తేన్ తిరుపతి గా పిలుస్తారు. అంటే దక్షిణ తిరుపతి గా భావిస్తూ ఉంటారు
తమిళనాడులో శ్రీరంగం తర్వాత తేన్ తిరుపతి అతి ముఖ్యమైన ఆలయంగా భక్తులతో పూజలందుకుంటోంది. సంప్రదాయ ఆలయాలతో పోలిస్తే ఇది భిన్నమైన ఆలయం. గరుడ వాహనం గరుడ అల్వార్ రెండు సింహాలతో దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం జులై ఆగస్టు మధ్యలో స్వాతీ నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఉత్సవ విగ్రహాలను శ్రీరంగం ఆలయం ఇచ్చిందని చరిత్ర చెబుతోంది.
ఈ ప్రాంతాల్లో ఏడు అంతస్తుల్లో 120 అడుగుల రాజగోపురం ఉన్న పెద్ద విష్ణు ఆలయంగా ఘనత సాధించింది. ఆలయ పైభాగాన్ని చెక్కతో చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయానికి ఉన్న రెండు గోపురాలు ఒకదానికి మించి ఒకటి అన్నట్లు ఉంటాయి. స్వామి ని ఒక్కసారి దర్శిస్తే సంతాన సమస్యలు పెళ్లి సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం. ఏటా 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.