Picsart 23 06 24 06 59 22 269

ఏ ఊర్లో అయినా ఊరిబయట దూరంగా సమాధులు ఉంటాయి. కానీ మన దేశంలో రెండు గ్రామాల్లో మాత్రం ప్రతి ఇంటి ముందు ఒక సమాధి ఉంటుంది. ఇంటి ముందు ఉన్న ఆ సమాధులకు పూజలు కూడా చేస్తారు. కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలం లో అయ్య కొండ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. వాళ్ళు పాటించే ఆచారాలు కూడా కాస్త వింతగానే ఉంటాయి ఇక్కడ ఎవరూ పట్టె మంచం మీద పడుకోరు. ఏ పనిమీద వెళ్ళిన వారైనా సూర్యాస్తమయం సమయానికి ఇల్లు చేరాల్సిందే. అయితే ఈ ఊళ్ళో ప్రతి ఇంటి ముందు ఒక సమాధి ఉంటుంది దానికి ఒక పెద్ద చరిత్ర ఉంటుంది

పూర్వం మాలదాసరి చింతల ముని స్వామి అనే వ్యక్తి ఈ ఊరి అభివృద్ధి కోసం కృషి చేశాడట ఆయన మరణించిన తర్వాత గ్రామస్తులు అక్కడే సమాధి కట్టి దానికి పూజలు చేయడం ప్రారంభించారు. వాళ్ల ఇళ్లలో ప్రతి రోజు ఇంట్లో వంట చేసిన తరువాత స్వామి సమాధికి నైవేద్యం పెట్టి తరువాత వాళ్ళు తింటారు.

అయితే క్రమంగా గ్రామంలో ఎవరు మరణించిన ఇంటి ముందు సమాధి కట్టడం ప్రారంభించారు. ఇంట్లో ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా సమాధి వద్ద పూజ చేసి ఆ తర్వాత పని మొదలు పెడతారు. ఒకవేళ అలా చేయకపోతే ఏదోరకంగా కీడు జరుగుతుందని నమ్మకం. అయితే కుటుంబాల సంఖ్య పెరగడం జనాభా రెట్టింపు కావడంతో చనిపోయిన వారిని ఇంటి ముందు కాకుండా గ్రామ సమీపంలో ఖననం చేస్తున్నారు కానీ ప్రతిరోజు సమాధి వద్ద నైవేద్యం పెట్టే ఆచారం మాత్రం ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఇక ఇలాంటి మరో గ్రామం జార్ఖండ్ లో ఉంది

ఆ గ్రామం పేరు బూత్.. ఈ గ్రామంలో కూడా కొత్త పాత ఇల్లయినా తప్పకుండా ఇంటి ముందు సమాధి కట్టాల్సిందే. దాన్ని పూజించకుండా ఏ పని చెయ్యరు. సాధారణంగా చనిపోయిన వారిని దెయ్యాలు గా భావిస్తారు కానీ అక్కడ మాత్రం చనిపోయిన వారందరినీ దేవుళ్లుగా భావిస్తారు. అందుకే ప్రతి ఇంటి ముందు సమాధి నిర్మించి పూజిస్తున్నారు. .ఇలా చనిపోయిన వారి సమాధులను ఇంటి ముందు పెట్టుకుని ప్రతి కార్యానికి వెళ్లే ముందు వాళ్ళని పూజిస్తే ఏ కష్టాలు రావు అని ఈ రెండు గ్రామాల ప్రజల నమ్మకం.. మరి ఇలాంటి నమ్మకాలపైన మీరేమంటారు… కామెంట్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!