20230530_083556

వేల సంవత్సరాల తర్వాత మన భారత్లో పుట్టి కాలగర్భంలో కలిసిపోయిన సైన్స్ కు పాశ్చాత్య దేశాలు మళ్లీ గుర్తింపు తీసుకొచ్చాయి

ఇది స్వయానా ఇస్రో చీఫ్ సోమనాద్ ఇటీవల మహర్షి పాణిని అండ్ సంస్కృతి అండ్ వేదిక్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. టెక్నాలజీ పాశ్చాత్య దేశాల వల్లే సాధ్యమైందని దాదాపు అందరూ విశ్వసిస్తున్నారు ఈ నేపధ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఈయన స్పీచ్ లో హైలెట్ అయిన మరో విషయం సూర్య సిద్ధాంతం

అసలు సూర్య సిద్ధాంతం అంటే ఏంటి ఇందులో ఏముంది. అనే విషయాలను చర్చించారు

భూమి గోళాకారంలో ఉంటుంది. భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి సగటున 365 రోజులు పడుతుంది

ఇప్పటి సైన్స్ లో మనకు ఈ విషయాలు తెలుస్తున్నాయి కానీ గెలీలియో , టాలమి వంటి దిగ్గజ శాస్త్రవేత్తలు కంటే ముందే మన భారత శాస్త్రవేత్తలు ఈ విశ్వం గురించి ఎన్నో విషయాలు తమ గ్రంథాల్లో తెలియపరిచారు అనే విషయం తెలుసా. అవును కొన్ని వేల సంవత్సరాల ముందే ఖగోళ శాస్త్రంపై మన దేశంలో సూర్య సిద్ధాంత అనే పేరుతో ఓ పుస్తకం ఉండేది. భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి ట్రాపికల్ ఇయర్ లెక్కన 365. 2 4 2 1 9 0 4 రోజులు పడుతుంది అనేది నేటి శాస్త్రవేత్తలు చెప్పే మాట. ఈ సంఖ్య 365.2421756 గా ఉంది అంటే కేవలం 1.4 సెకన్లు మాత్రమే తేడా.

భూమి మాత్రమే కాదు మంగళ అంటే మార్స్, బుధ అంటే మెర్క్యురీ బృహస్పతి అంటే జూపిటర్, శుక్ర, శని గృహాలకు సూర్యుడి చుట్టూ తిరిగే కాలాన్ని కూడా ఈ సూర్య సిద్ధాంతం లో తెలిపారు. మార్స్ కి సూర్యుడు చుట్టూ తిరిగేందుకు ఆరు వందల ఎనభై ఆరు రోజుల 23 గంటల 56 నిమిషాల 23.5 సెకన్లు పడుతుందని సూర్య సిద్ధాంతం చెబుతోంది

20 వ శతాబ్దంలో ఈ లెక్క ఆరు వందల ఎనభై ఆరు రోజుల 23 గంటల 30 నిమిషాల 41.4 గా ఉంది

మిగతా గ్రహాల లెక్కలు ఇప్పటి గణాంకాలకు దాదాపుగా సరిపోతాయి గ్రహాలు తిరిగే క్రమంలో వాటి ఉపరితలం గ్రహణాలు, గ్రహాల కూటమి, ఇలా ఎన్నో విషయాలను 14 భాగాలుగా విభజించి 500 పద్యాలు కూర్చారు నాటి శాస్త్రవేత్తలు. సూర్య సిద్ధాంతం లోని మూడు మరియు 13 భాగాలు అయితే నీడతో సైన్స్ ను ఎలా లెక్కపెట్టవచ్చు అని కూడా ఉంది. ఇప్పటి గణితశాస్త్రంలో త్రిజ్ఞమేట్రి లో ఉపయోగించే సైన్, కో సైన్ విలువలు కూడా ఉన్నాయి. ఈ సూర్య సిద్ధాంతం రచన త్రేతా యుగంలో జరిగింది అని సమాచారం. త్రేతా యుగంలో రావణాసురుడికి మామగారైన మయాసురుడు మొదటగా ఈ సూర్య సిద్ధాంతాన్ని రచించాడట. అయితే ఇప్పుడున్న ఆధారాల ప్రకారం ప్రస్తుతం మనకి తెలిసిన సూర్య సిద్ధాంతాన్ని నాలుగు, ఐదు శతాబ్దంల మధ్య కాలానికి చెందినదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆర్యబట్టు కాలం, తర్వాత వచ్చిన భాస్కరా చార్య ఈ సూర్య సిద్ధాంతం లో పలు మార్పులు చేశారు. 8వ శతాబ్దంలో తొలిసారిగా అరబ్బులు ఈ సూర్య సిద్ధాంతం గురించి తెలుసుకున్నారు. దానిని వారు తమ భాషలో అనువాదం చేసుకున్నారు. మొత్తంగా ఇది సూర్య సిద్ధాంతం గురించిన కథ.. మీకు ఈ ఆర్టికల్ నచ్చితే లైక్ చేసి., కామెంట్ చేయండి.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!