నాకు ఉదయం లేస్తూనే చాల ఉత్సహంగా ఉంటుంది. అప్పుడు ఆఫీస్ కు బయలుదేరితే ఆ శక్తి అంతా ప్రయాణంలోనే వృధా గా పోతుంది, అందుకే 6 గంటలకల్లా లేచి పిల్లలు లేవక ముందే ఇంట్లో కొంత పని చేస్తా..


టెక్నాలజీ అన్నది ‘యాపిల్ లా ఏకకాలంలో అందంగా, పొందికగా, సర్వసమర్ధంగా ఉండొచ్చని నిరూపించి, ప్రపంచాన్ని సమ్మోహనపరిచిన సంచలన సాంకేతిక రుషి.. స్టీవ్ జాబ్స్. 

• ఆయన రోజు ఎలా గడిపేవారు? 
ఓసారి స్టాన్ ఫోర్డ్ లో మాట్లాడుతూ “గత 33 ఏళ్లుగా ప్రతి రోజూ లేస్తూనే అద్దం ముందు నిలబడి నా జీవితంలో ఇదే ఆఖరి రోజైతే.. అప్పుడూ నేనివాళ చెయ్యబోతున్న పనులనే చేస్తానా? అని ప్రశ్నించుకుంటున్నా. ఎప్పుడన్నా వరసగా 2, 3 రోజులు ‘కాదన్న’ సమాధానం వచ్చిందంటే మాత్రం పద్ధతి మార్చుకోవాలనే అర్థం’ అని చెప్పారు. 

స్టీవ్ 6 గంటలకే లేచి ఇంట్లోనే పని మొదలెడతారు. 1. 30కి కుటుంబ మంతా కలిసి డ్రైఫ్రూట్స్, సాలడ్స్ తింటారు. అక్కడ్నుంచి పిల్లలు స్కూలుకు వెళితే జాబ్స్ మళ్లీ పనిలోకి వెళ్లిపోతారు. దాదాపు 2 గంటలు ఇంటి నుంచే పని చేసి, అప్పుడు ఆఫీసుకు చేరేవాళ్లు. ప్రతిరోజూ నల్ల టీషర్టు, బ్లూ జీనే! ఆఫీసులో సోమ, బుధవారాలు తప్పనిసరిగా కీలక సారధులతో సమావేశమై సమీక్ష చేసేవాళ్లు.

అంత పెద్ద సాంకేతిక దిగ్గజమైనా ఆయనేనాడూ స్కైప్, వీడియో ఛాట్ల వంటివి ఇష్టపడింది లేదు. “ముఖాముఖి కలవాలి. కళ్లలోకి చూడాలి, చెప్పేది వినాలి, కోపమొస్తే అరవాలి, అవసమైతే హత్తుకోవాలి. నిజాయతీగా మనస్సులో ఏం ఆలోచిస్తున్నారో తెలియాలి” అనేవారు. మధ్యాహ్నం ఆపిల్స్, క్యారెట్ల వంటివే తినేవారు. 1,80-8 మధ్య పూర్తిగా డిజైన్ ల్యాబ్లో తలమునకలు, 8. గంటలకు మెయిల్స్, ఫోన్ కాల్స్ చూసుకునేవాళ్లు. తన మెయిల్ ఐడీని అందరికీ చెప్పేశారు. దీంతో ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్లు చాలానే వచ్చేవి. 

సగటున రోజూ ఒక 100 మెయిల్స్, 10 ఫోన్ కాల్స్ కు బదులిచ్చేవాళ్లు. సాయంత్రం 5.30కి ఇంటి దగ్గర కుటుంబంమంతా భోజనానికి కూర్చునేది. 6.30 నుంచీ నడక. రాత్రి 10 గంటలకు సంగీతం వింటూ నిద్రకు ఉపక్రమించటం! తీవ్ర అనారోగ్యంతో మరణించే వరకూ కూడా ఇదే జాబ్స్ దినచర్య. పార్టీలకూ వెళ్లే వారు కాదు. పని, కుటుంబం తప్పించి తనకేం పట్టవని జాబ్స్ స్వయంగా చెప్పేవాళ్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!