Bank Jobs

స్పోకెన్ ఇంగ్లీష్ : ఇంగ్లీష్ నేర్చుకునే విధానం, కష్టమైన ఇంగ్లీష్ పదాలు ఎలా నేర్చుకోవాలి?

ఈ రోజు మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అధ్యాయం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ (భాషాభాగాలు). ఏ భాషకైనా ప్రతి విషయాన్ని వ్యక్తపరిచే విధానం సులభంగా, వేగంగా చెప్పేందుకు ఈ భాషాభాగాలు ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ భాషలో ఒక్కో సందర్భం, ఉపయోగిస్తున్నపదం స్వభావాన్నిబట్టి ఈ భాషాభాగాలను ఎనిమిది రకాలుగా విభజించుకున్నాం. అవేంటో ఒకసారి చూద్దాం.

 • 1.Noun-నామవాచకము 
 • 2.Pronoun-సర్వనామము
 • 3.Adjective- విశేషణం 
 • 4.Verb క్రియ
 • 5.Adverb క్రియావిశేషణం
 • 6.Preposition-అవ్యయము
 • 7.Conjunction-సముచ్చయము
 • 8.Interjection- భావోద్వేగ వ్యక్తీకరణ

ఈ ఎనిమిది భాగాలు వేటికవే ప్రత్యేకం. వీటిమీద పట్టు సాధిస్తే సెంటెన్స్ ఫ్రేమింగ్ అంటే వాక్యనిర్మాణం సులువుగా నేర్చుకోవచ్చు.

ఒక్కోభాగం గురించి తెలుసుకుందాం….

1.NOUN(నామవాచకం):-

వాస్తవానికి noun అనే పదం ‘nomen’ అని పిలుచుకునే లాటిన్ పదం నుంచి తీసుకొన్నారు.

A noun is a word that refers to a person, an animal, a place or a thing.   

వ్యక్తులు,ప్రదేశాలు,వస్తువులపేర్లను తెలిపేందుకు ఈ నామవాచకాన్ని ఉపయోగిస్తాం. 

ఈ నామవాచకం మన సౌకర్యాన్నిబట్టి పలు రకాలుగా విభజించుకున్నాం. అవి

1.Abstract noun

2.Collective noun

3. Proper noun 

4. Countable noun

5.Uncountable noun

6. Concete noun

*Abstract noun:- ఏదైనా ఈవెంట్, సంఘటన, ఆలోచన, లక్షణం వంటి పదాలను మనం ‘Abstract Noun’ గా పిలుస్తాం.

ఉదా:- Courage, Freedom, Affection etc. 

 • * Collective Noun:- oke samuhaniki ఒకే సమూహానికి చెందిన వారిని గురించి వ్యవహరించే పదాలు ఈ collective nounగా పిలుస్తాం.

ఉదా:- College Students, Employees, Audience etc.

*Proper Noun

 • ఒక వ్యక్తి, ప్రదేశం, వస్తువు వంటి పేర్లను చెప్పేందుకు Proper Nounని వినియోగిస్తాం.

ఉదా:-  Krishna,Raghava, India, Knife, Door etc.

 • *Countable noun సరిగ్గా లెక్క పెట్టి చెప్పగలిగే nouns ని countablenounగా వ్యవహరిస్తాం. 

ఉదా- two dogs, three cats etc. 

 •  *Uncountable noun లెక్కపెట్టేందుకు వీలులేని వాటి గురించి చెప్పేందుకు ఈ uncountable nounsని వినియోగిస్తాం. 

ఉదా- Furniture, news, water etc.

 • *Concrete noun వస్తువులు, ప్రదేశాల గురించి చెప్పేందుకు nounsని వినియోగిస్తాం.     

Table, Beach, coffee etc.    

 ఇక రెండో భాగం 

Pronoun (సర్వ నామము)

Pronoun(సర్వనామము ) అనే పదం నామవాచకానికి బదులుగా ఉపయోగిస్తాం. 

ఉదాహరణకు రాజా అనే వ్యక్తి గురించి చెప్తున్నామనుకోండి. ఒకసారి అతడి పేరు గురించి చెప్తే సరిపోతుంది.ప్రతిసారి చెప్పే అవసరం లేదు

ఉదా:- 

Raja was absent because raja was ill. 

ఇక్కడ మనం ప్రత్యేకంగా రాజు అని మళ్లీ చెప్పం.

Raja was absent because he was ill. 

ఇక్కడ రాజుకు బదులుగా he అనే పదం ఉపయోగించాం. అంటే he అనే పదం నామవాచకానికి బదులుగా వాడాం.  ఇక్కడ He అనేపదం Pronoun.

 ఇంకో ఉదాహరణ చూద్దాం.. 

The Pens are where you left the pens. 

పెన్స్ నువ్వు వదిలిన చోటే ఉన్నాయి.

ఇక్కడ పెన్స్ అనే noun గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు.

The pens are where you left them

పెన్స్ అనే నామవాచకానికి బదులుగా Them అనే సర్వనామాన్నిఉపయోగించాం. ఇప్పుడు అర్థమైందిగా Pronoun ఉపయోగం.

ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.

అదే పర్సన్స్ Persons (పురుష)

Persons అనే కాన్సెప్ట్. సర్వనామాన్ని ఎలా ఉపయోగించాలో సులభంగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

Persons మూడు రకాలు. 

1st Person (ప్రథమ పురుష)

2nd Person(ద్వితీయ పురుష)

3rd Person(తృతీయ పురుష)

ఇవి ఎలా విభజించామంటే ఒక్క ఉదాహరణ చూద్దాం.మనకే అర్థమైపోతుంది.

ఇప్పుడు మన గురించి మనం చెప్తున్నామనుకోండి. మనమే 1st పర్సన్ అవుతాం.

అదే మనం పక్క నున్న ఫ్రెండ్ ని ఉద్దేశించి చెప్తున్నామనుకోండి. అతడు అక్కడే ఉన్నాడు.అతడిని 2nd పర్సన్ గా పరిగణిస్తాం.

మన ఫ్రెండ్ తో వేరేవారి గురించి చెప్తున్నామనుకోండి. వారు 3rd పర్సన్ అవుతారు.

మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే 1st పర్సన్ లో ఎప్పుడూ చెప్పేవారే ఉంటారు.

అలాగే ఎప్పుడూ మనకు ఉపయోగపడే చిన్న చిట్కా కూడాచూద్దాం.

ఏకవచనం-బహువచనం 

Singular- Plural

 పర్సన్     Singular                       –  Plural

1st Person   I(ఐ), Me,Myself            -We

2nd Person You                      – You

3rd Person  He, She,It                    -They 

పైన చెప్పినవన్నీ ఓసారి గమనించండి. వీటిని ఆయా సందర్భాన్ని బట్టి Noun స్థానంలో ఎవరున్నారో చూసుకొని,  SIngular or Plural అన్న విషయం గుర్తించి అందుకు సరిపోయే పదాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది.

ఇంకో చిన్నఉదాహరణ చెప్పుకుందాం.

Raja went to raghu’s house. Then they decided to have dinner in hotel. 

ఈ సెంటెన్స్ లో మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదట రాజా రఘు ఇంటికి వెళ్లిన సంగతి చెప్పాం.తరువాత వారిద్దరూ హోటల్ కు వెళ్లి డిన్నర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుసుకున్నాం. ఇక్కడ రెండో వాక్యంలో వారిద్దరి గురించి చెప్పడానికి They అనే పదాన్ని ఉపయోగించాం. అంటే రెండో వాక్యంలో ఇద్దరినీ కలిపి చెప్పేందుకు బహువచనాన్ని ఉపయోగించాం. ఇది 3rd పర్సన్ plural అన్నమాట. మొదటి వాక్యంలో Raju, Raghu నామవాచకాలన్న మాట. పై ఉదాహరణను ఓసారి విశ్లేషణ చేస్తే parts of Speechని సందర్భానుసారంగా ఎలా వినియోగించామో చూడొచ్చు.

ఈ pronouns కూడా సందర్భాన్ని బట్టి విభజించుకున్నాం. 

అవి,

 • Personal Pronouns
 • Demonstrative Pronouns 
 • Interrogative Pronouns
 • Possessive Pronouns
 • Relative Pronouns 
 • Reflexive Pronouns
 • Intensive Pronouns
 • Reciprocal Pronouns
 • Indefinite Pronouns

Leave a Comment

error: Content is protected !!