పెన్స్ లో 2 రూపాయల ధర నుండి 5 రూపాయలు , 10 రూపాయల వరకు ఎన్నోరకాల పెన్నులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి, వీటిలో ఎన్నోరకాల ప్రముఖ కంపెనీలు కూడా పెన్నులు తయారు చేస్తూ లాభాలు సంపాదిస్తున్నాయి
అయితే మన దేశంలో చాల మంది మధ్య తరగతి మరియు దిగువ తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు వారు ఇలాంటి ఎక్కువధర కాకుండా తక్కువధర గల పెన్నులను కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు, అందువల్ల యూజ్ అండ్ త్రో పెన్నుల తయారీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, కాబట్టి మనం యూజ్ అండ్ త్రో పెన్నుల తయారీని ఇంట్లోనే ప్రారంభించి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు,
ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావలసిన రా మెటీరియల్, మెషినరీ, పెన్నులను ఎలా తయారు చేస్తారు, పెన్నుల తయారీ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.