Self Employment

అదిరిపోయే బిజినెస్ ఐడియా ఇది | డిమాండ్ ఎప్పటికి తగ్గదేలే | నెలకు లక్ష గ్యారంటీ | small profitable business ideas

self employment business ideas telugu

పెళ్లి అయినా, పుట్టినరోజైన ఫంక్షన్ ఏదైనా సరే ఖచ్చితంగా భోజనాలు ఉండాల్సిందే అలాగే భోజనాలు తినాలంటే ప్రధానంగా కావాల్సింది ప్లేట్లు.  ఫంక్షన్ కి వచ్చే వాళ్ళందరికీ స్టీల్ మరియు వెండి కంచాలలో భోజనాలు వడ్డించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దానికి ప్రత్నామ్యాయమే పేపర్ ప్లేట్లు, ప్రస్తుతం మార్కెట్లో ఈ పేపర్ ప్లేట్లకు మంచి డిమాండ్ ఉంది.

ఫంక్షన్ లోనే కాదు పెద్ద పెద్ద హోటల్ నుంచి వీధిలో చిరుతిళ్ళ బండ్ల దగ్గర సైతం ఈ పేపర్ ప్లేట్ వాడుతున్నారు. అందుకే ఈ పేపర్ ప్లేట్స్ తయారీ అనేది మంచి బిజినెస్ ఐడియా గా తయారయింది. ఈ పేపర్ ప్లేట్లకు ,మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఆ డిమాండ్ ఎలా ఉంది అంటే ఉదాహరణకు ఒక పానీపూరి బండి అతను రోజుకు సుమారుగా 300 ప్లేట్ లను యూజ్ చేస్తున్నాడు. అంటే మీ ఏరియాలో కనీసం 6 కిలోమీటర్ల పరిధిలో సరాసరి 20 వరకు పానీపూరి బండ్లు ఉండే ఉంటాయి. ఒక పానీపూరి బండికి 300 ప్లేట్ల చొప్పున 20 బండ్లకు 6000 పీసులు ఒకరోజుకు వాడుతున్నారు. యావరేజ్ గా నెలకు చూసుకుంటే 1,80,000 పీసులను వాడుతున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పేపర్ ప్లేట్ లకు ఎంత డిమాండ్ ఉందొ.

దీనిపై ఇప్పటికే ఎంతో మంది ఆధారపడి పని చేస్తూ ప్రతి నెల వేల రూపాయలు సంపాదిస్తున్నారు ఇంట్లో ఉండే గృహిణుల అలాగే నిరుద్యోగ యువత స్వయం సహాయక బృందాలకు ఇది మంచి ఉపాధిగా మారుతుంది

అయితే మీరు కూడా ఈ బిజినెస్ లో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి ఎలా ప్రారంభించాలి బిజినెస్ లో ఎంత వరకు పెట్టుబడి అవసరం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి. అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం .

పేపర్ ప్లేట్లు తయారీ బిజినెస్ కు ఫ్యాక్టరీ లేదా ఒక యూనిట్ అవసరం లేదు వీలుంటే మీ ఇంట్లోని చిన్నగది సరిపోతుంది లేదా ఒక షెడ్ వేసుకుని ఈ మిషన్ ను పెట్టుకోవచ్చు. లేకపోతె ఒక చిన్న షాప్ ను లీజుకు తీసుకుని అందులో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ మిషన్ లకు సింగిల్ పేజ్ కరెంట్ సరిపోతుంది. ముఖ్యంగా ఈ బిజినెస్ ప్రారంభించాలంటే అన్నింటికన్నా ప్రధానమైనది పేపర్ ప్లేట్లు తయారు చేసే మెషిన్ లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఈ మిషన్లు మీకు రెండు రకాలుగా లభిస్తాయి, ఒకటి సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ మరియు డబుల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మెషిన్. ఇక పేపర్ ప్లేట్లు తయారు చేయడం కోసం ముడి సరుకు కొనుగోలు చేయాలి . మొత్తంగా ఈ బిజినెస్ పెట్టాలంటే మీరు పెట్టె పెట్టుబడిని బట్టి ఒక లక్ష నుండి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

తయారీ విధానం ఒకసారి చూసినట్లయితే హైడ్రాలిక్ మిషన్ హెడ్ కింద ప్లాస్టిక్ తో లామినేషన్ చేసిన షీట్ ను ఉంచితే మిషన్ దాన్ని రౌండ్ గా కట్ చేస్తుంది. ఆ తరువాత దాన్ని ప్లేట్ గా మారుస్తుంది.

ఈ బిజినెస్ లో ఖర్చులు మరియు లాభాల వివరాలు చూసినట్లయితే ఒక ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మెషిన్ తో మీరు 8 గంటలపాటు పనిచేస్తే సుమారుగా 16,500 ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. 1000 పీసులు ఒక బండిల్ గా అనుకుంటే 1000 పీసుల ధర మార్కెట్లో సుమారుగా 460 రూపాయల వరకు ఉంటుంది. అంటే 16 బండిల్స్ కి 16×460 = 7360 అవుతాయి. ఇందులో రా మెటీరియల్ మరియు కరెంట్ ఖర్చులు 2500 రూపాయలు తీసివేస్తే 7360-2500=4860 రూపాయలు అన్ని ఖర్చులు పోను ఒకరోజుకు సంపాదించుకోవచ్చు. అంటే నెలకు ఒక లక్షకు పైగా ఆదాయం సంపాదించుకోవచ్చు.

పేపర్ ప్లేట్ బిజినెస్ పెట్టడం తో పోల్చితే మార్కెటింగ్ చేయడమే ఇక్కడ పెద్ద సవాల్తో కూడుకున్న పని పేపర్ ప్లేట్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయం వాళ్ళు ముందుగా మీ ప్రాంతంలోని స్థానిక హోల్ సేల్ వ్యాపారులను షాపు ఓనర్ లతో డిస్ట్రిబ్యూటర్ లతో మాట్లాడుకోవాలి. వారికి మన సరుకును సప్లై చేసే విధంగా లేదా మన సరుకును వాళ్లు మార్కెటింగ్ చేసే విధంగా ఒప్పందం చేసుకోవాలి. దానివల్ల మన సరుకును అమ్ముకోవడం సులభమవుతుంది

Leave a Comment

error: Content is protected !!