చాల మంది తమ బిజీ లైఫ్ నుండి కాస్త రిలీఫ్ పొందడానికి ఎక్కడైనా కొత్త ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలనీ అనుకుంటారు, అయితే అక్కడికి ఎలా వెళ్లాలి, వెళ్లిన అక్కడి ప్రదేశాల గురించి ఎవరు చెబుతారు అని చాలా ప్రశ్నలు మనకు ఎదురవుతాయి, కానీ వీటన్నిటికీ ఇప్పుడు చాలా సులువుగా పరిష్కారాలు ట్రావెల్ ఏజెన్సీ వారు మనకు నివృత్తి చేసి, మనకు ఎలాంటి ప్రదేశాన్ని అయినా సందర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు.
అందువల్ల ఇలాంటి ట్రావెల్ ఏజన్సీ లను ఏర్పాటు చేసినట్లయితే మీరు స్వయం ఉపాధి పొందటమే కాకుండా మరికొంత మందికి ఉపాధి చూపుతూ భారీగా లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ వ్యాపార విషయానికి వస్తే మనకు ఎక్కవ పెట్టుబడి అవసరమే లేకుండా మన మాటలనే పెట్టుబడిగా పెట్టి చేయగల వ్యాపారం ఇది.