వంట నూనె లేకుండా ఏదైనా వంటకం ఊహించుకోగలరా… సాధ్యం కాదు కదా అయితే అలాంటి వంటనూనె నాణ్యత లేకుండా కల్తీ అయితే కోట్లమంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి కల్తీ నూనె ను ఆహారంలో వాడడం వల్ల చాలా మంది చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ బారినపడి హార్ట్ ఎటాక్ ఇలాంటి సమస్యలకు కారణమవుతోంది.
మరి వారందరినీ ఈ అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతూనే మనం కూడా అద్భుతమైన బిజినెస్ చేసుకుని మంచి ఆదాయం సంపాదించుకోగల బిజినెస్ గానుగ నూనె బిజినెస్.
ఆవాల నుంచి వేరుశనగ దాకా కొబ్బరి నుంచి పొద్దుతిరుగుడు దాకా ఎన్నో రకాల ఆయిల్స్ ని ఆయిల్ మిల్ లో తయారు చేస్తారు కానీ మిల్లుల స్థాయిలో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి కదా అని భయపడకండి చిన్న చిన్న మిషన్ లతో ఇంటి దగ్గర నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు. కానీ ఈ బిజినెస్ అయిన స్టార్ట్ చేసే ముందు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే లాభాలు రావు. ఏ బిజినెస్ అయినా పట్టుదలతో చేయాలి దాని కోసం కష్టపడాలి ఓపిక పట్టాలి.
మరి ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి దీనికి పెట్టుబడి ఎలా ఉంటుంది మార్కెటింగ్ ఎలా చేయాలి ఏ స్థాయిలో ఉంటుంది ఈ వివరాల్ని ఈ వీడియోలో చూద్దాం.
ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ మెషిన్ అవసరం ఉంటుంది ఈ బిజినెస్ కి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కసారి పెట్టుబడి పెడితే సుదీర్ఘకాలంపాటు లాభాలు పొందొచ్చు ఈ బిజినెస్ లో….మహిళలు నిరుద్యోగులకు ఈ బిజినెస్ బెస్ట్ స్వయం ఉపాధి గా ఉపయోగపడుతుంది
పెట్టుబడి ఎంత కావాలి
గానుగ నూనె తయారీ వ్యాపారం మొదలు పెట్టేందుకు 10X10 సైజ్ ఉన్న గది సరిపోతుంది అంటే మీ ఇంట్లోనే మెషిన్ పెట్టుకుని ఈ వ్యాపారం మొదలు పెట్టొచ్చు అన్నమాట.
ఇక ఈ మిషన్ కెపాసిటీ బట్టి ఖరీదు ఉంటుంది 10, కేజీలు 15 కేజీలు 20 కేజీల మిషన్లు 150000 మొదలుకొని మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఉంటాయి. 20 కేజీల మిషన్తో అయితే ఎక్కువ నూనెను ఒకేసారి ఉత్పత్తి చేయవచ్చు అంతేకాకుండా ఈ బిజినెస్ చేయాలంటే మీకు వర్కర్లు కూడా అవసరం ఉండదు మీరే ఈ మిషన్ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక కరెంట్ మరియు ముడిపదార్థాల కు మార్కెట్ రేట్ ప్రకారం ఖర్చు ఉంటుంది
లైసెన్స్ ల వివరాలు
ఆయిల్ మిల్లు ఏర్పాటు చేయడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా fssai లైసెన్స్ పొందడం తప్పనిసరి దీంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి
మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి
మీ మిల్లులో తయారైన నూనెను నేరుగా లేదంటే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అమ్ముకోవచ్చు డబ్బాలు లేదా సీసాలలో ప్యాక్ చేసి కస్టమర్లకు అందించవచ్చు. మీరు మీ పట్టణంలో ఉన్న హోటళ్ళు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, రిటైలర్ షాపుల్లో మాట్లాడుకుని మన ఆయిల్ ని అక్కడ కూడా విక్రయించవచ్చు అయితే మన నూనె ఎంత నాణ్యతగా ఎంత స్వచ్ఛంగా కల్తీ లేకుండా ఉంటుందో అంత మంచి మార్కెట్ అండ్ గుడ్ విల్ ఏర్పడుతుంది
ఆదాయం ఎంత ఉంటుంది.
గానుగ నూనె తయారీ మిషన్ లో కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఇలా రకరకాల నూనెలు తీయొచ్చు
ఈ మిషన్ లో 20 కేజీల ముడి పదార్థాన్ని ఆడించేందుకు సుమారుగా ఒక గంట సమయం పడుతుంది ఇలా మీరు ఈ మిషన్ తో ఎనిమిది గంటల పని చేస్తే 8X20= 160 కేజీల ముడి పదార్థాన్ని ఆడించవచ్చు. అందులో సుమారు 40 శాతం వరకు అంటే దాదాపుగా అరవై నాలుగు కేజీల వరకు 70 లీటర్ల నూనె వస్తుంది. మీరు ఇలా తయారు చేసుకున్న నూనెను మార్కెట్లో లీటరు పైన 50 రూపాయల లాభం చూసుకుని అమ్మినా 72X50 = 3500 లాభం వస్తుంది.
ఇలా మీరు ఒక రోజుకు 3500 బిజినెస్ చేస్తే నెలకు 3500X30= 1,05,000/- ఆదాయం సంపాదించుకోవచ్చు. లాభం కొంచెం అటు ఇటు గా వేసుకున్న 70 నుంచి 80 వేల రూపాయలు ఎటు పోవు….అలాగే నూనె తీసిన తర్వాత మిగిలే విత్తనాల పిప్పిని అమ్మి కూడా డబ్బు సంపాదించు కోవచ్చు.
ఈ పిప్పిని పశువులకు దాణాగా ఉపయోగిస్తారు దీనిపై కూడా కిలోకు 20 నుంచి 30 రూపాయల వరకు ఆదాయం ఉంటుంది వస్తుంది. ప్రతి ఇరవై కేజీల ముడి పదార్థానికి 12 కేజీల పిప్పి వస్తుంది. పైన చెప్పిన విధంగా మీరు 8గంటల పాటు 160 కేజీల ముడి పదార్ధం ఆడిస్తే 96 కేజీల పిప్పి వస్తుంది . ఒక కేజీ 20 లు వేసుకుంటే 96 కేజీలకు 1920 రూపాయలను కేవలం పిప్పి అమ్మి సంపాదించు కోవచ్చు. అంటే నెలకు 37,600 అవుతుంది. ఈ బిజినెస్ లో కరెంట్, రెంట్ ఇతర ఖర్చులు అన్నిటికీ విప్పి తో వచ్చే ఆదాయం సరిపెట్టుకుంటే నూనె పైకి వచ్చే లక్ష మన నికర ఆదాయం అవుతుంది
అయితే నూనె తీసేందుకు వాడే ముడి పదార్థాలను బట్టి మన ఆదాయం మారుతుంది పల్లీలు, నువ్వులకు తక్కువగా… కొబ్బరి నూనెకు ఎక్కువగా ఆదాయం సంపాదించవచ్చు ఏది ఏమైనా ఆయిల్ మిల్ వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ. అలాగే ఇది ఒక టైం వెస్ట్ కాబట్టి ఒకసారి పెట్టుబడి పెడితే చాలు సంవత్సరాల తరబడి సంపాదించుకోవచ్చు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి ఏ బిజినెస్ అయినా పట్టుదలతో చేయాలి దాని కోసం కష్టపడాలి ఓపిక పట్టాలి.
కానీ మీరు మీ ఏరియాలో ఉన్న మార్కెటింగ్ పై దృష్టి పెట్టి ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ వ్యాపారాన్ని అంది పుచ్చుకుంటే ఈ ఆయిల్ బిజినెస్ లో మీరు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం లేకపోలేదు.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి బిజినెస్ ఐడియా మీరు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ వ్యాపారం గురించి అన్ని విషయాలు పూర్తి గా తెలుసుకుని ఈ బిజినెస్ మొదలు పెట్టి ఇందులో మంచి లాభాలు సంపాదించు కోవలని కోరుకుంటూ మరో సరికత్త బిజినెస్ ఐడియా తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | వాట్సాప్ గ్రూప్ లింక్ |
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |
https://thisisgore.com/