Capture

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో నైట్ వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు నేడు పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. ఇవే కాకుండా కొన్ని పాఠశాలల్లో స్మార్ట్ టివిలు , ఇంటరాక్టివ్ ప్యానెల్ లు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని పాఠశాలల్లో రాత్రివేళ దొంగతనాలు జరుగుతున్నాయని, విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని పిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా 5388 నైట్ వాచ్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వారికీ గౌరవ వేతనంగా 6000 రూపాయలను ఇవ్వనున్నారు.

ఈ ఉద్యోగాలకు ఇప్పటికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయా భర్తకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు, రెండవ ప్రాధాన్యం మాజీ సేవ పురుషులకు ఇస్తారు. ఈ రెండు విభాగాలలో అర్హులు లేకుంటే పేరెంట్స్ కమిటీ నుండి అర్హతలు గల వ్యక్తికీ ఈ ఉద్యోగం ఇస్తారు.

GO for Night Watchmen

png-transparent-whats-app-logo-whatsapp-logo-whatsapp-cdr-leaf-text-thumbnailమా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
unnamedబిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
One thought on “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నైట్ వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!