కృష్ణుడి ప్రేమకు ప్రతీకగా నిలిచే బృందావన్ లో… దట్టమైన అడవుల మధ్య లో నిధివన్ ఉంటుంది. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు అక్కడే రంగ మహల్ లో మంచాన్ని అందంగా అలంకరించి నిదీవన్ లోకి ప్రవేశాన్ని నిషేధిస్తారు… ఉదయం చూసేసరికి ఆ గదిలో వస్తువులన్నీ చిందరవందరగా ఉంటాయి అసలు నిదీవన్ లో ప్రతి రోజూ ఏం జరుగుతుంది…. తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే…
ఇతిహాసాలతో ముడిపడిన దేశం మనది. ఇక్కడ ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యం ఉంటుంది. ఇక శ్రీకృష్ణుడు అనగానే ఆధ్యాత్మికత అంతకంటే ముందు తన అల్లరి ఎక్కువ గుర్తొస్తుంది. బృందావనంలో కృష్ణుడు నిత్యం వందలాది గోపికలను ఆట పట్టిస్తూ ఉంటాడట… అయితే ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఉనికిలో ఉంది అదే బృందావనంలో దట్టమైన అడవుల మధ్య లో వున్న నిదీవన్…
ఉదయం వేళల్లో భక్తులు నిధివన్ ను సందర్శించవచ్చు కానీ సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రం… ఆ పరిసరాల్లోకి అడుగు పెట్టకూడదు. ఎందుకంటే ప్రతి రోజు ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో ఆటలాడతాడట.. వినడానికి విచిత్రంగా ఉన్నా స్థానికులు దీనిని బలంగా నమ్ముతారు
కృష్ణుడు ప్రతి రాత్రి నిదీవన్ కి వచ్చి తన ప్రియురాలైన రాధ మరియు ఇతర గోపికలతో కలిసి నృత్యం చేస్తాడని ప్రజలు విశ్వసిస్తారు. కానీ ఇప్పటివరకు ఇదంతా ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేరు. అయితే గతంలో కొంతమంది నిదీవన్ లోని చెట్ల వెనుక దాక్కొని ఆ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు తర్వాత రోజు మతిస్థిమితం కోల్పోయిన వారిలాగా ప్రవర్తిచే వారు. మరికొందరు చూపు, మాట కూడా కోల్పోయారట. అప్పటి నుంచి ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యలేదు.
ఇక నిదీవన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రి అయితే అటు వైపు ఉండే కిటికీలు, తలుపులు అన్నీ మూసేస్తారు. నిదీవన్ లో అనేక చెట్లు ఉంటాయి.. ఆ చెట్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి.. సాధారణంగా చెట్ల వేర్లు కిందకి కొమ్మలు పైకి ఉంటాయి. కానీ అక్కడ మాత్రం రివర్స్… అంటే చెట్ల వేర్లు భూమి లోంచి పైకి వచ్చి వంకర టింకర గా ఉంటాయి.. చెట్ల ఆకులు భూమి వైపు వంగి ఉంటాయి. ఇక నిదీవన్ లో ఉండే ప్రతి తులసి మొక్కకు ఒక జత గా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి ఈ తులసి మొక్కలు గోపికలుగా మారి కృష్ణుడితో నృత్యం చేస్తాయి. ఉదయం మళ్ళీ తులసి మొక్కలు గా మారి పోతాయట. అందుకే ఆలయ పరిసరాల్లో ఉన్న తులసి ఆకులను తుంచడం నిషిద్ధం.. ఒకవేళ ఎవరైనా వాటిని తుంచాడానికి ప్రయత్నిస్తే వారి జీవితంలో ఊహించని విపత్తులు సంభవిస్తాయి అని అంటూ ఉంటారు. అందుకే ఈ ఎవరూ అక్కడ తులసి మొక్కలను తాకే సాహసం చెయ్యరు.
ఇక నిదీవన్ లోపల రంగ్ మహల్ ఉంటుంది. దీనిని రాధారాణి గిరిధర్ ఘర్ అని కూడా పిలుస్తారు. జానపద కథల ప్రకారం కృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడికొస్తాడు. ఇంకా తన చేతులతో రాధను ఆభరణాలతో అలంకరిస్తారు అట. రంగ్ మహల్ లోపల ఒక మంచం దాని సమీపంలో అనేక ఆభరణాలు అలంకరించుకునే వస్తువులు కూడా ఉంటాయి. నిధివన్ గురించి విని చాలా మంది కట్టుకథ అని కొట్టిపారేశారు. కానీ స్థానికులు దానికి తామే సాక్షం అని చెబుతారు. మరి అక్కడ ఏం జరుగుతుందో ఎవరూ చూడక పోవచ్చు కానీ ప్రతి రాత్రి రాణి మహల్ లో ఎవరో నృత్యం చేస్తున్నట్లుగా గజ్జల శబ్దాలు వినిపిస్తుంటాయి. పూజారులు తమలపాకు, వక్క, పూజ నీటినీ మంచం పక్కన ఉంచుతారు. తర్వాత ఆలయానికి తాళాలు వేస్తారు. ఇక ఉదయం పూజారిగా ఆలయం లో కి వెళ్ళినప్పుడు అలంకరణలు అన్నీ చెల్లాచెదురుగా కనిపిస్తాయి వస్తువుల్ని చిందరవందర ఉంటాయి..
అందుకే రాధాకృష్ణులు రోజు ఆలయం లోకి వస్తారని నృత్యం చేస్తారని భక్తులు నమ్ముతారు. రంగ్ మహల్ కు తాళం వేసే ముందు పూజారులు ప్రసాదాన్ని 5 ముక్కలుగా చేసి ఆలయంలో పెడతారు. తెల్లవారి చూసేసరికి ఒక ముద్దను పూర్తిగా రెండో ముద్దను సగం తినేసినట్టు ఉంటాయి ప్రతి రోజు జరిగేది ఇదే… ఇది కూడా అంతుబట్టని రహస్యం..
మర్మమేదైనా, సంఘటనలు ఎలా జరిగినా శ్రీకృష్ణుని విశ్వసించే భక్తుల హృదయాల్లో మాత్రం నిదీవన్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది.. ఈ ఆర్టికల్ పైన మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి…