కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి అనుకోకుండా మరణించినప్పుడు సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం ఒక కుటుంబాన్ని పోషిస్తున్నారు అది ఆడ మగ వాడు ఐనా సరే ఈ కారణంచేత మరణించిన ఆ కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. అంటే మరణించిన వ్యక్తి యొక్క భర్త లేదా భార్య మైనర్ పిల్లలు అవివాహిత కుమార్తెలు తమ పైన ఆధారపడిన తల్లిదండ్రులు వారికి ఈ సహాయం అందుతుంది.
మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఒకసారి చూద్దాం…
- మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి.
- ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి మరణించిన కుటుంబ పెద్ద స్థానంలో బాధ్యతలు చూసేవారే ఉండాలి
- అన్నిటికంటే ముఖ్యంగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి
- దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు కుటుంబాల వారికి మాత్రమే ఈ సాయం అందుతుంది
ఈ పథకం పొందాలనుకునేవారు కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ విషయాన్ని దరఖాస్తుదారుడి ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లాలి. తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి వివరాలను పూర్తిగా ఫిల్ చేసి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి మండల రెవెన్యూ అధికారికి సమర్పించాలి.
దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వంటి ఏదైనా గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా వివరాలు, దరఖాస్తుదారుడి మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో పాటు మరణించిన వారి పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, డెత్ సర్టిఫికెట్ ఏదైనా ఒక గుర్తింపు కార్డు సమర్పించాలి.
ఈ దరఖాస్తును మండల స్థాయి అధికారులు చెక్ చేసి మీరు అర్హులు అని భావిస్తే మీ దరఖాస్తును ఈ పథకానికి ఎంపిక చేస్తారు