కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు… ఉన్నంత మాత్రాన మంచి వాడు కాదు ప్రతి దానికి నడిపించే కారణం ఒకటి ఉంటుంది
గొడవపడని బంధాలు అందమైనవి అయితే ఎన్ని గొడవలు పడిన విడిపోని బంధాలు అద్భుతమైనవి
మనిషికి ఉన్న… రెండు అద్భుతమైన వరాలు తన మరణం ఎప్పుడో తెలియకపోవడం తనతో ఉన్న వ్యక్తులు… తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో..? తెలియకపోవడం
మనసు బాగ లేనప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాగు లేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి
నీ సంతోషాన్ని నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు అందరూ చూస్తారు కానీ నీ బాధని నీ మనసుకు దగ్గరైన వాళ్ళు మాత్రమే చూస్తారు
అన్నీ గమనిస్తూనే ఉండాలి. కానీ ఏమి తెలియనట్టే ఉండాలి. కానీ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితముగా స్పందించాలి.
కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్టు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తనవాళ్ళను తానే దూరం చేసుకుంటాడు.
రాత్రి వీధిలో వెలుగు ఉన్నంత వరకే, జనాలు తిరుగుతారు. ఇంట్లో బాధ్యత గల మనిషి ఉంటేనే ఎదురు తిరగడం మానేస్తారు.
కష్టాలను ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం…!
నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటి వారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు నీ కోసం నువ్వు.. నిజమైన వ్యక్తిత్వంతో జీవించు..!
ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు. కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే..!!
ఓటమి, ఒంటరితనం ఈరెండు జీవితం లో చాల నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది
ఒక ఆలోచన నిన్ను… నిద్రపోనివ్వడం లేదు అంటే.. అది నువ్వు సాధించల్సింది… ఐనా అయ్యుండాలి లేదా… భాధించేదైన అయ్యుండాలి…
మనుషులకు దగ్గరగా ఉండి దూరం చేస్తున్నారు అని బాధపడే కన్నా..,, దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవడం ఉత్తమం.
కష్టాలను ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం…!
ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం “అదే జీవితం”
ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది అదే రాయి తేనె తెట్టుపై విసిరితే మనం పారిపోవాలి కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్య బలం పెద్దది…. ఐకమత్యమే మహాబలం
పాముపడగ నీడలో బతకడం ఎంత ప్రమాదమో కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం పైకి కనిపించరు కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది..!
మనం ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది
ఒక మంచిమిత్రుడు వందసార్లు అలిగినా బతిమాలుకోవడంలో తప్పులేదు దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతేపోనీ అని వదిలేయక దండలో తిరిగి కూర్చుతాం కదా ఇదీ అలాగే మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ
రాసిన పేజీని చించలేము రాయని పేజీని చదవలేము అందుకే ఏ రోజు పేజీని ఆరోజే అందంగా రాసుకుందాం
ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అందరూ మనవాళ్ళు.. అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు..!!
మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఇష్టమైన వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడిన చాలు ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటాం…
విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు ధనం వచ్చాక మిత్రులని మరిచిపోకు భార్య వచ్చాక కన్నవారిని మరిచిపోకు.. గౌరవం వచ్చాక గతం మరిచిపోకు.. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మరిచిపోకు
ఆడపిల్లకి పెళ్లి చేసేముందు ఉన్నోడ లెనోడా అని కాదు మనసు ఉన్నవాడా, చెడు అలవాట్లు లేనివాడా అని చూడాలి ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు.
నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు తప్పక సమాధానం చెబుతుంది
ఎవరేంటి అన్నది నీకు అనవసరం.. నువ్వేంటి అన్నది నువ్వు తెలుసుకో..!! నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏమి తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు..!!
మూర్ఖులతో వాదన.. మన బుగ్గమీద వాలిన దోమని చంపడం లాంటిదే.! దోమ చచ్చినా, చావకపోయినా.మన. చెంపలు వాయించుకోడం మాత్రం.. ఖాయం.!!
మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి మార్గం కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకూ పని చేస్తూనే ఉంటారు ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడి పెట్టండి
నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి
బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకవచ్చు.. కానీ నీతి, నిజాయితీ గా బ్రతికితేనే ఆ బ్రతుక్కి అర్థం ఉంటుంది.. ఆ మనిషికి విలువుంటుంది..
ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు..అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినపుడు ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం.
అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది.మనం ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుందిఅరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది.
బానిసగా బ్రతికినంత కాలం ఊరంతా చుట్టాలే… ఒక్కసారి ప్రశ్నించడం మొదలుపెడితే సొంతింటోళ్ళు కూడా శత్రువులే.
అప్పట్లో మనిషి వయసుని చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు. గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు
తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి.. కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం… నిజంతో ధైర్యంగా బ్రతకడం..
వింటున్నారు కదా అని… కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని… నాటకాలు ఆడకండి. ఏదో ఒక రోజు… నిజాలు తెలిసి వాళ్ళు దూరమయి వినేవారు లేక నమ్మేవారు కనబడక, ఒంటరిగా మిగిలిపోతారు..
మనిషి గొప్పతనం ఆరడుగుల అందంలో కాదు ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది.
రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉండి కూడా కైకేమి బాగుపడలేదు అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు.. మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం
బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయ్ కానీ ప్రతిసారీ.. నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలెయ్ ఎందుకంటే జీవితమంతా తల దించుకుని బతకడం అసాధ్యం
నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు
ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు, అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకోవాలి.. ఒకసారి చేయి పట్టుకున్నాకా విడిచిపెట్టొద్దు, విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోవద్దు అదీ స్నేహం అయినా ప్రేమ అయినా…!!
ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప..
జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.
కొందరి వాగ్దానాలు తీయటి అబద్ధాలు నోటి మాటలు నీటి మీద రాతలు
నా జీవితములో కాలం నేర్పిన పాఠాల కంటే కావలసిన వాళ్ళు నేర్పిన పాఠాలే ఎక్కువ
ఎదుటి వారి కోపాన్ని, లోపాన్ని కూడా అర్థం చేసుకునే వాడే నిజమైన స్నేహితుడు
మన జీవితం కురుక్షేత్రమే అయినా మంచి చెప్పడానికి, నిన్ను నడిపించడానికి ఇక్కడ శ్రీ కృష్ణుడు లేడు మనలో పాండవులు అసలే లేరు వందల కొద్దీ కౌరవుల మందలే ఇక్కడ
కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక…. మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది…!!
గెలవవచ్చు కానీ గర్వపడకూడదు, భయపడవచ్చు కానీ పారిపోకూడదు, ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు, అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి.. వాటిని తట్టుకుని నిలబడాలి కానీ, భయపడి కూలబడకూడదు..!
అంత అయిపోయింది అని ఆగిపోతావా, జీవితంలో ఇంకా చాలా మిగిలివుంది అని సాగిపోతావా, నిర్ణయించుకో..
ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు ఎందుకంటే… ప్రతిసారీ గతం గురించి ఆలోచించేవాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు
మనస్సున్న మనుషులను పక్కనపెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్న వారే ఎక్కువ ఇక్కడ
కుటుంబం అంటే రక్తసంబంధం ఉన్నవాళ్ళే కాదు ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకుని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే
అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏకాకి అయినప్పుడు కూడా భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు
సంపాదన లేని మగవాన్ని, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ సమాజం….!
ఇంటి కోడలు వేరు కాపురం పెడితే సంస్కారం లేదు పెంపకం సరిగా లేదు అంటారు, అదే మీ కూతురు వేరు కాపురం పెడితే చాలా తెలివైనది బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంది అంటారు, ఇది ఎక్కడి న్యాయం.
ఎప్పుడూ సముద్రగర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని అవి చాలా విలువైనవని తెలియదు అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరమయ్యేవరకూ మన విలువేంటో తెలియదు
నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు
మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మనచుట్టూ ఉన్నవాళ్లు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి
ఒక భర్త గెలుపు అయినా ఓటమి అయినా భార్య కారణం అన్నది ఎంత నిజమో ఒక భార్య కన్నీటికి అయినా ఆనందానికి అయినా భర్తే కారణం అన్నది అంతే నిజం
రాత్రంతా సూర్యుడు. ఓపిక పడుతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడుతాడు కాబటే రాత్రవ్వగానే నిండుగా నవ్వుతాడు ప్రతీ ఒక్కరికీ ఒక టైం వస్తుంది. కావాల్సిందల్లా ఓపిక
ఏ బంధమైనా కోపంలో దూరమైతే మళ్ళీ దగ్గరయ్యే అవకాశముంటుంది అలా కాకుండా మనసు విరిగి బాధతో దూరమైతే మళ్ళీ దగ్గరవ్వడం చాలా కష్టం అందుకే దగ్గరగా ఉన్నప్పుడే దూరం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి
మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు.. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు
అవసరం ఉన్నా… లేకున్నా…. ఒకేలా ఉండటం నేర్చుకోవాలి… అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకాల్సి వస్తోంది
మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు.. అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు
ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్న దాని లో అవకాశం వెతుక్కోవడం వివేకవంతుల లక్షణం
ఏ బంధం అయినా ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే…. అద్దం అబద్ధం చెప్పదు. నీడ మనల్ని వదిలి వెళ్ళదు…
ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్ర పోవడానికి కూడా అదృష్టం ఉండాలి..!
బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు, ఇప్పుడు అంతా డబ్బు, డబ్బు, డబ్బు .. దీనికే విలువ..?
ఒకర్ని అపార్ధం చేసుకోవటం లో ఉన్నంత శ్రద్ధ.. అర్ధం చేసుకోవటంలో ఉంటే.. బంధాలు ఎప్పటికి దూరం. కావు..!!
చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు,,స్వచ్ఛమైన మనసు కలవారు…
గాలికి ఎదురు నిలబడటం ఎంత ప్రమాదమో.. గాలి మాటలు మోసేవారితో స్నేహం కూడా అంతే ప్రమాదం..!!
ఈలోకంలో ఎక్కువ సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి.
మిమ్మల్ని ప్రేమించేవారి మనసుని ఎప్పుడూ గాయపర్చకండి ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు మౌనంగానే మీ జీవితం నుండి వెళ్లిపోతారు