images (2)

ఫ్రెండ్స్ మీ చేతిలో చేపలు పట్టే వల ఉన్నంత మాత్రాన సరిపోదు. అది ఎక్కడ విసురుతున్నారన్నదీ కూడా ముఖ్యమే. మీరు కాలువలో వల వేస్తే.. పిల్లచేపలే పడతాయి. చెరువులో వేస్తే ఓ మోస్తరు చేపలు పడతాయి. అదే సముద్రమైతే.. టన్నుల కొద్దీ మత్స్య సంపదంతా మీదే. ఇప్పుడు నేను చెప్పింది మీ సంపాదనకూ ఈ పోలిక వర్తిస్తుంది.  కాబట్టి ఎక్కడా రాజీపడకుండా.. మీ మీద నమ్మకంతో మీ వలను సముద్రం మీదికే విసరండి. ఏదో ఒకరోజు సంపన్నుల జాబితాలో చేరిపోతారు. 

సో ఇక విషయంలోకి వెళ్తే ఈ రోజు సరికొత్త బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం.. మనకున్న బాడీ పార్ట్స్ లో కళ్ళు అనేవి చాలా ప్రధానం. ఇప్పుడు ఈ కళ్ళు అనేవి చాల మంది కంప్యూటర్స్, మొబైల్స్ ఇలా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువుల చాల దగ్గర నుండి చూడడం వల్ల మన కళ్ళు దెబ్బతింటున్నాయి. దీని వల్ల  చాలామంది కళ్ళజోడులను వాడుతున్నారు. చిన్నపిల్లలు దగ్గరనుంచి పెద్ద వాళ్ల వరకు ఈ స్పెర్ట్స్ వాడుతున్నారు. కొంతమంది స్టైల్స్ కోసం కొంతమంది డాబు కోసం , మరి కొంతమంది స్విమ్మింగ్ కోసం ఇంకొంత మంది  బైక్స్ నడపడం కోసం ఈ కళ్ళ జోడును వాడుతూ ఉన్నారు. 

ఇలా ప్రతి ఒక్కరు వివిధ సందర్భాలలో ఈ కళ్ళ జోళ్లను వాడుతూ ఉండటం వల్ల ఈ కళ్ళ జోళ్ళ సెల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మంచి లాభాలు సంపాదించుకోవచ్చు 

ఈ బిజినెస్ కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ బిజినెస్ రెండు రకాలుగా చేసుకోవచ్చు. దీనిలో మొదటిది ENT Doctor తో టైయ్యప్ అయ్యి ఒక షాపు లాగా పెట్టుకోవచ్చు. ఈ షాప్ కి ట్రేడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కూడా తీసుకోవాలి.

కళ్ళజోళ్ళు, కళ్ళజోళ్ళు ఫ్రేమ్లు కళ్ళజోడికి కావాల్సిన అన్ని వస్తువులు పెట్టుకోవాలి. మనకు వచ్చిన లాభంలో  కొంచెం ప్రాఫిట్ డాక్టర్లకు ఇచ్చి మనం ఆదాయం సంపాదించుకోవచ్చు. పేషంట్ కి ఉన్న ఐ సైట్ ని  బట్టి గ్లాసెస్ అనేవి తీసుకుని కస్టమర్ కి నచ్చిన ఫ్రెమ్ లో వాటిని సెట్ చేయవలసి ఉంటుంది కాబట్టి  దానికి స్కిలేడు పర్సన్ ఒకరు కావాలి.  ఈ విధంగా షాప్ పెట్టుకోవడానికి రెండు నుండి  లేదా మూడు లక్షలు పెట్టుబడి అయితే పెట్టవలసి ఉంటుంది. 

ఇక రెండవది చూసుకుంటే మార్కెట్ లో చాల పాపులర్ కంపెనీలు వాటి ఫ్రాంచైజీని అఫర్ చేస్తున్నాయి. మార్కెట్లో ఏ కంపెనీ బ్రాండ్ కి మంచి పేరు ఉందొ తెలుసుకుని ఆ కంపెనీ యొక్క ఫ్రాంచైజీని తీసుకోవచ్చు.. దీనికి ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువగా పెట్టవలసి వస్తుంది. 

ఇలా ఫ్రాంచైజీ అఫర్ చేసే కంపెనీలు ఆ డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీకు ఇంట్రస్ట్ ఉంటె ఆయా కంపెనీల వెబ్సైట్ లలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.  

ఇలా వాళ్ళు  మనకి స్టోర్ పెట్టుకోవడానికి బ్రాంచెస్ ఆఫర్ ను ఇస్తారు. ఈ కంపెనీలలో ముఖ్యమైనవి   లెన్స్ కార్ట్, టైటాన్ ఐ ప్లస్ , హిమాలయ ఆప్టికల్స్, మెడ్ ప్లస్ ఆప్టికల్స్ ముఖ్యమైనవి  ఇలా  చాలా కంపెనీలు తమ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తూ ఉంటాయి. దీంతో మీరు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఆయా కంపెనీల  వెబ్సైట్లోకి వెళ్లి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఈ ఫ్రాంచైజీల కోసం మీరు మీ పట్టణంలో రద్దీగా ఉన్న ఏరియాలో ఆ ఏరియాలో ఉన్న పాపులేషన్ ను బట్టి 500 నుండి 1500 స్క్వేర్ ఫీట్ ప్లేస్ అయితే కావాలి. బాగా రద్దీగా ఉన్న ప్లేస్ లో దీన్ని పెట్టుకోవాలి.

ఫ్రాంచైజీల కోసం కంపెనీలను బట్టి  పది నుంచి 15 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆయా కంపెనీలకు  రాయల్టీ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది.  లోకల్ అథారిటీ పర్మిషన్  కూడా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరిగా తీసుకోవాలి.

మార్కెటింగ్ అనేది చూసుకుంటే బ్రాండ్  నేమ్ అనేది  ఉంటే ఆ కంపెనీవారు పబ్లిసిటీ కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి కస్టమర్ లు  చాలా ఈజీగా మన ప్రొడక్ట్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్రాండ్ నేమ్  కచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రాడక్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అవుతూ ఉంటాయి. ఇంకా సోషల్ మీడియా ద్వారా కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇక ప్రాఫిట్ విషయానికొస్తే లక్ష రూపాయలు ప్రోడక్ట్ ని మనం సేల్ చేస్తే 30 వేల వరకు లాభం పొందవచ్చు.

Lenskart franchise: https://partners.lenskart.com/Titan eye plus franchise: https://www.titaneyeplus.com/franchise/

Himalaya opticals franchise: https://himalayaoptical.com/pages/fra…

Medplus Opticals franchise: https://www.medpluslens.com/contactus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!