రాజకీయ నాయకుల మీటింగ్‌లకు, సభలు సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు, సెలబ్రిటీలకు స్వాగతం తెలిపేందుకు, శుభాకాంక్షలు చెప్పడానికి.. చాలా మంది ఫ్లెక్సీ లను తయారు చేయించి రహదారుల మధ్యలో లేదా పక్కన, యాడ్ హోర్డింగ్‌లకు అమరుస్తుంటారు . అయితే నిజానికి కొద్దిగా శ్రమించే తత్వం, పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉండాలే గానీ ఎవరైనా.. ఫ్లెక్స్‌ను తయారు చేసి ప్రింట్ చేసే బిజినెస్ పెట్టవచ్చు. దీంతో నెల నెలా రూ.లక్షల్లో ఆదాయం ఉంటుంది.
ఈ బిజినెస్ ను మనం రెండు విధాలుగా చేయవచ్చు, ఒకటి మిషన్లు కొనుక్కొని చేయడం, రెండు మనం కేవలం ఫ్లెక్స్ బ్యానర్ ను డిజైన్ చేసే మిషన్ ఉండే వారిదగ్గర ప్రింట్ చేయించి కస్టమర్ కు ఇవ్వడం మొదటి దానికి సుమారుగా 8 లక్షలవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, రెండవ దానికి కేవలం ఒక లక్షలోపు పెట్టుబడి సరిపోతుంది,