మహిళలు ఇష్టపడి చేసే పనుల్లో కుట్టుపని ఒకటి. తక్కిన లోదుస్తుల తయారీతో పోలిస్తే బనియన్ల తయారీ సులువనే చెప్పాలి. కత్పరింపు తేలిక. ఐరనింగ్, కుట్టు వంటి తక్కువ దశల్లో పని పూర్తవుతుంది. ఈ పరిశ్రమను మహిళలు తేలిగ్గా నిర్వహించుకోవచ్చు.
చిన్నారుల నుంచి పెద్దల వరకూ అవసరమైన బనియన్ల తయారీకి ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో చూద్దాం. బనియన్ ల తయారీకి ఉపయోగించే వస్త్రం పేరు నిట్టెడ్ ఫాబ్రిక్ . ఇది తెలుపు రంగులోనే కాకుండా రకరకాల రంగుల్లో అందుబాటులోకి వస్తోంది. దాంతో రంగుల బనియన్లను కుట్టవచ్చు .