ప్రస్తుతం చికెన్, మటన్ కన్నా చేప మాంసం తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేప మాంసం డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు గుండె సమస్యలకు చేపలు చాలా మంచివి. అందుకోసం కూడా చేపలను తినేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.
ఆధునిక వ్యవసాయం పద్ధతుల ద్వారా యువరైతులు సిరులు కురిపిస్తున్నారు. తక్కువ నీటితో అతి తక్కువ మంది కూలీలతో , సేంద్రియ విధానంలో లాభాదాయకమైన చేపల సాగు RAS, Recycling Aqua Culture System చేపట్టి మంచి ఆదాయం సాధిస్తున్నారు. కేవలం పావు ఎకరంలో సంవత్సరానికి 70 టన్నుల దిగుబడిని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చుట్టు పక్కల నదులు కానీ, వరదనీటి కాలువలు గానీ లేకుండానే. కేవలం బోర్లతో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకాన్ని విజయవంతంగా చేసి చూపుతున్నారు.