Bank Jobs

IBPS RRB 2023 || గ్రామీణ బ్యాంకులలో భారీగా ఉద్యోగాలు

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్న వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకులు లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లలో ప్రొబేషనరీ ఆఫీసర్ క్లర్క్ మరియు ఆఫీసర్ స్కేల్ 2 ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8463 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న 43 బ్యాంకులలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ఉద్యోగాల వివరాలు

ఐబీపీఎస్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లో కార్యాలయ సహాయకుడు మార్కెటింగ్ మేనేజర్ మేనేజర్ ఆఫీసర్ స్కేల్-1 బ్యాంకింగ్ స్కేల్ ఆఫీసర్ 2, వ్యవసాయ అధికారి గ్రేడ్-2 గ్రేడ్-3, లా ఆఫీసర్ గ్రేడ్-3 , చార్టెడ్ అకౌంటెంట్ గ్రేడ్-2, ఐటీ అధికారి గ్రేడ్-2 తదితర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి

విద్యార్హతలు

ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి కంప్యూటర్ పైన పరిజ్ఞానం కలిగి ఉండాలి

అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగానికి విద్యార్హతలు అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హజ్బెండరీ అగ్రికల్చర్ ఇంజనీర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో డిగ్రీ పాసైన అభ్యర్థుల ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి

జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అంటే కనీసం 50 శాతం మార్కులతో బ్యాంకింగ్ ఫైనాన్స్ అగ్రికల్చర్ / శ్రీ హార్టికల్చర్ /యానిమల్ హజ్బెండరీ /అగ్రికల్చర్ ఇంజనీరింగ్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎకనామిక్స్ లలో అభ్యర్థులు పాసై ఉండాలి

స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా ఆఫీసర్ డిగ్రీ లేదా మొత్తంగా 50 శాతం మార్కులతో సమానమైన డిగ్రీ పాసై ఉండాలి

సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాంకింగ్/ ఫైనాన్స్ /మార్కెటింగ్ /అగ్రికల్చర్ /యానిమల్ హజ్బెండరీ /అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోపరేషన్ తదితర సబ్జెక్టులతో పాసై ఉండాలి

వయసు పరిమితి

మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య అంటే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జూన్ 1995 కంటే ముందు మరియు 1 జూన్ 2005 2006 ముందుగా జన్మించి ఉండకూడదు

ఆఫీసర్ స్కేల్-1 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు అంటే అభ్యర్థులు 30 జూన్ 1991 30 జూన్ 2005 కంటే ఈ రెండు తేదీలు కలుపుకుని జన్మించి ఉండకూడదు

ఆఫీసర్స్ Gr-2 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 20 ఏళ్ళ పైబడి ఉండాలి అంటే 30 ఏళ్ల 32 ఏళ్ల లోపు ఉండాలి

ఆఫీసర్ Gr-3 ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి

దరఖాస్తు ఫీజు

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు Rs. 850 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులు Rs.175 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ నుంచి 1 జూన్ 2023 నుంచి 21 June 2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి

ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆఫీసర్ స్కేల్-1 రెండు మరియు మూడు అభ్యర్థులకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు క్లర్కు ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు Prelims మరియు Mains ఆధారంగా ఎంపిక చేస్తారు

ముఖ్యమైన తేదీలు వివరాలు

నోటిఫికేషన్ విడుదలైన తేదీ 15 జూన్ 2023 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 1 జూన్ 2023

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 జూన్ 2023

ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ 17 జూలై 2023 నుంచి 22 జూలై 23 2023 మధ్య జరుగుతుంది

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!