భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి , ఈ యాడ్ మీలో చాలా మంది చూసే ఉంటారు . ఈ రంగంలో రాణించి ఇప్పుడు వందలాది టర్నోవర్ చేస్తోంది కంపెనీ ,
ఇక ఈ మధ్య కాలంలో ఎంతోమంది కుటీర పరిశ్రమలుగా పూజ ద్రవ్యాల వ్యాపారాలు చేస్తూ చక్కటి ఆదాయం పొందుతున్నారు. మరి ఈ వ్యాపారాలను ఎలా ప్రారంభించాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మన దేశంలో దైవారాధన, పూజలు, పుణ్యకార్యాలు ఎక్కువ . వాటి కోసం ముఖ్యంగా కర్పూరం, అగర్బత్తి, సాంబ్రాణి, నూనె ఇలా ఎన్నో రకాల పూజ పదార్ధాలు వాడుతుంటారు . అందుకే ఈ పూజా సామగ్రి మార్కెట్లో మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది . ఇక వీటన్నిటిలో సాంబ్రాణికి ఇంకా డిమాండ్ ఎక్కువ
వీటిని పూజ కోసమే కాకుండా ఇంటి సువాసన కోసం, స్త్రీల జుట్టు పోషణ కోసం వాడుతూ ఉంటారు. అందుకే చాల మంది ఈ పూజా సామాగ్రి తయారీని బిజినెస్ గా చేస్తూ పెట్టుబడికి మించిన లాభాలు పొందుతున్నారు
తయారీ ఎలా :
సాంబ్రాణి కప్స్ తయారీకి ప్రధానంగా కావాల్సింది సాంబ్రాణి కప్స్ తయారీ మెషిన్. ఈ మిషన్లు మాన్యువల్ గా అంటే కరెంట్ లేకుండా చేత్తో పనిచేసేవి, రెండు ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఎలక్ట్రిసిటీ తో పనిచేసేవి రెండు రకాలుగా లభిస్తాయి . చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు మాన్యువల్ మిషన్ కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. మాన్యువల్ సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్ ధర మార్కెట్లో 30 వేల రూపాయల నుండి మొదలవుతుంది. కానీ ఈ వీడియో లో ఉన్న నంబర్ కి కాల్ చేసి మీరు ఈ సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్ ను కేవలం 20 వేలరూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఈ మిషన్ తో పాటు మీకు ఒక మైక్రో వేవ్ ఓవెన్ అవసరం ఉంటుంది. ఈ మనువల్ మిషన్ రన్ చేసేందుకు ఎలాంటి పవర్ అవసరం లేదు. ఓ వర్కర్ సహాయం తీసుకుంటే సరిపోతుంది. మనువల్ మిషన్ తో రోజుకు రెండువేల సాంబ్రాణి కప్పులను తయారు చేయవచ్చు.
పెట్టుబడి ఎంత అవసరం :
ఈ వ్యాపారానికి పెట్టుబడి రూపంలో 50,000 వరకు అవసరం ఉంటుంది. 30 వేల తో మెషిన్ కొనుగోలు చేసుకోవాలి అలాగే మైక్రోవేవ్ ఓవెన్ పది వేల నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక కప్పుల తయారీ పౌడర్ కోసం మరో ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది
కావలసిన ముడి పదార్థాలు :
సాంబ్రాణి కప్స్ తయారీకి సాంబ్రాణి ప్రీమిక్స్ పౌడర్ కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది, ఇందులో రెండు రకాల premix powders దొరుకుతాయి ఒకటి బొగ్గుతో తయారు చేస్తే మరొకటి చెక్క పొట్టు తో తయారు చేస్తారు. ఈ రెండు రకాల premix పౌడర్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి వీటికి కొంత నూనె కలిపి మెషిన్ ద్వారా కప్పులు తయారు చేసుకోవాలి . ఆ తర్వాత ఎండలో బాగా ఎండబెట్టాలి చివరగా ఫ్లేవర్ , మరియు సుగంధ పౌడర్ ను వీటిలో నింపి మైక్రోవేవ్ మిషన్ లో పెట్టి కాస్త లో వేడి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తప్పులు వేసిన సామ్రాణి గడ్డకడుతుంది అంతే ఇక ప్యాకింగ్ చేసి అమ్మడమే
తయారీ ఖర్చు :
ఇలా చేసిన సాంబ్రాణి కప్పులను 10 కేజీలు లెక్కన ఆదాయం లెక్కిస్తే ఒక కేజీ ప్రీమిక్స్ పౌడర్ ఖర్చు 120 అంటే పదికేజిలు 1200 రూపాయలు అవుతుంది. పది కేజీల ప్రీమిక్స్ పౌడర్ తో 800 సాంబ్రాణి కప్పులను తయారుచేసుకోవచ్చు. వీటి ప్యాకింగ్ కోసం బాక్స్ లను కొనాలి, ఒక్కో బాక్స్ 5 రూపాయల వరకు అవుతుంది. ఒక్కో బాక్స్ లో 20 చొప్పున సాంబ్రాణి కప్పులను ఉంచి ప్యాకింగ్ చేసిన 40 ప్యాక్ లు అవుతాయి. అంటే ప్యాకింగ్ ఖర్చు 200 రూపాయలన్నమాట. 1200+200+ ఒవేన్ కరెంట్ మరో 100 రూపాయలు వేసుకున్న 40 ప్యాక్ లకు 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక్కో ప్యాక్ కు 37 నుంచి 40 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
మార్కెటింగ్ ఎలా :
ఈ రోజుల్లో ప్రతి దుకాణం లోను ఈ సాంబ్రాణి కప్పులు విక్రయిస్తున్నారు మీ ఏరియాలో ఉన్న ఇంటి చుట్టుపక్కల గల దుకాణాలకు కూడా వీటిని విక్రయించవచ్చు దీంతో మనకి పెట్టుబడి పక్కనబెడితే మూడు నుంచి నాలుగు రెట్లు ఆదాయం అందుతుంది . లేదంటే హోల్సేల్ దుకాణదారులకు విక్రయించిన కనీసం పెట్టుబడికి రెట్టింపు ఆదాయం అయినా ఖచ్చితంగా వస్తుంది
రెట్టింపు ఆదాయం పక్కా :
రిటైల్ మార్కెట్లో సాంబ్రాణి బాక్స్ ల ధర 180 నుండి 200 దాక పలుకుతోంది. అయితే ఈ ధర మీరు వాడే సుగంధి మిక్స్ ఆధారంగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. ఒక్కో బాక్స్ కు 200 చొప్పున వేసుకున్న మొత్తం 40 బాక్స్ లకు 8000 వేలరూపాయల వరకు ఆదాయం పొందొచ్చు, ఇందులో పెట్టుబడి తీసేస్తే 6000 వేలరూపాయలకు పైగా ఆదాయం ఉంటుందన్నమాట. అలా కాకుండా హోల్సేల్ మార్కెట్ లో ఒక్కో బాక్స్ 80 రూపాయలకు అమ్మిన 3200 వస్తాయి అదే 1700 రూపాయల వరకు ఆదాయం దొరుకుతుంది ఒకవేళ నెలకు వెయ్యి బాక్సులు తయారుచేసి హోల్సేల్ లోనే అమ్మిన నెలకు 40 వేల దాకా ఆదాయం లభిస్తుంది
మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లోనే ఈ చిన్న కుటీర పరిశ్రమను ప్రారంభించి మంచి ఆదాయం పొంది మీ కళల జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు