మన దగ్గర ఉన్న బిజినెస్ ఐడియాతో పాటు మార్కెటింగ్ పై అవగాహన ఉంటే స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. నిత్య జీవితంలో మన చుట్టూ ఉండే అవసరాలను గమనించి వాటినే ఆదాయవనరుగా చేసుకుంటే డబ్బు సంపాదించడం మరింత సులువు. ఇలాంటి ఒక వ్యాపార మార్గమే “థర్మాకోల్ ప్లేట్ల తయారీ” బిజినెస్. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్ల కైనా, రిసెప్షన్ల కైనా, బర్తడే పార్టీలకైనా ఫంక్షన్ ఏదైనా సరే బఫె పద్దతిలో విందు ఇవ్వడం అనేది సర్వసాధారణం అయిపోయింది.
How to Start Paper Plate Making Business at Home Local Small Business Ideas |
సహజంగా ఈ బఫె పద్ధతిలో విందు ఇవ్వడానికి థర్మాకోల్ ప్లేట్లను ఎక్కువగా వాడుతుంటారు. శుభకార్యాలకే కాకుండా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో సైతం వీటి వాడకం ఎక్కువ. ఇలా వీటి వాడకం నిత్యం ఉండటంవల్ల ఈ థర్మాకోల్ ప్లేట్లకు మంచి డిమాండ్ వుంది. అందువలన వీటి అవసరాన్ని ఆదాయవనరుగా మలచుకుని లక్షల్లో డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇక ఈ థర్మాకోల్ ప్లేట్ల తయారీ వ్యాపారానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం.