నాటు కోళ్లు పెంపకం ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమై ఉండేది. ప్రస్తుతం వీటి వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తోంది. వీటి గుడ్లు, మాంసానికి నిత్యం డిమాండ్ ఉంటోంది. దీంతో గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ వీటి పెంపకానికి పలువురు ఆసక్తి కనబరుస్తూ.. అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు.
వేలల్లో పెట్టుబడి పెట్టి నెలకు లక్షల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కొందరైతే సాఫ్ట్ వేర్ వంటి ఉద్యోగాలను సైతం వదిలి వీటిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సొంతంగా వ్యాపారం చేసుకోవాలనే వారికి ఇదొక చక్కటి అవకాశంగా చెప్పొచ్చు. తక్కువ కాలంలోనే అతి తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయాన్ని సంపాదించవచ్చు.