ప్రతీ ఒక్కరు బిజినెస్ రంగంలో రాణించాలని అనుకుంటారు. అయితే మహిళలు తమ ఇంటివద్దే ఉంటూ కూడా మంచి సంపాదన సంపాదించవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మహిళలకు ఇంటివద్దనే ఉంటూ చేసుకునే బిజినెస్ గురించి చెప్పబోతున్నాను.
ఈ మధ్య కాలంలో నగరాల్లో బ్యాచిలర్స్, అలాగే స్టూడెంట్స్, ఉద్యోగులు తమ వంట తామే చేసుకొని టిఫిన్ బాక్స్ ఏర్పాటు చేసుకునే టైం లేక, హోటల్స్, మెస్సులను ఆశ్రయిస్తున్నారు ఇలాంటి వారు తమ ఇంటి వంట అందులోను అమ్మ చేసిన కమ్మని వంటకాల రుచిని ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఇంటి వాతావరణంలోని భోజనం ప్రతిరోజు వీరికి అందుబాటులోకి తెస్తే అది ఒక చక్కటి వ్యాపారంగా మారుతుంది.