how to make hyderabad dum biryani at homehow to make hyderabad dum biryani at home

బిర్యానీలో హైదరాబాదీ ధమ్‌ బిర్యానీకి ప్రాధాన్యత ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడైనా ఈ బిర్యాని గురించి తెలియని వాళ్ళు ఉండరు. అయితే అదే రుచితో మన ఇంట్లో కూడా హైదెరాబాదీ బిర్యాని తయారుచేసుకోవచ్చు. అందుకోసం ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం.

కావలసిన వస్తువులు : 1. కేజికి సరిపడా కుండ (లేదా) పాత్ర. 2. మరో పెద్ద పాత్ర, 3. రంధ్రాలు ఉన్న గిన్నె (లేదా) కాటన్‌ చీర, 4. బకెట్‌.

కావలసిన పదార్థాలు : బియ్యం-అర కేజి, చికెన్‌-అర కేజి, కారం-3 టీస్పూన్లు, ఉప్పు-తగినంత, పసుపు-అర టీస్పూన్‌, గరం మసాల (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర) పొడి-2 టీస్పూన్లు, పెరుగు -2 కప్పులు, నిమ్మకాయలు-4, పచ్చిమిర్చి-5, పుదీన-2 కట్టలు, కొత్తిమీర-3 కట్టలు, లెమన్‌ కలర్‌-1 టీస్పూన్‌, నూనె-పావు కిలో, ఉల్లిపాయలు- చిన్నవి 4.

తయారుచేయు విధానం : ముందుగా చికెన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా చేసి కుండలో లేదా పాత్రలో వేయాలి. దానికి ఉప్పు, కారం, గరం మసాల, పసుపు, పెరుగు, నిమ్మరసం చేర్చి చికెన్‌ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. మిర్చి, పుదీన, కొత్తిమీర మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో అవసరమైతే కొద్దిగా నీరు పోయవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా చికెన్‌ ఉన్న పాత్రలో వేసి బాగా కలపాలి. పాత్ర పైన మూత పెట్టాలి. తర్వాత ఉల్లిపాయలను సన్నగా, పొడవు ముక్కలుగా తరిగి, వాటిని నూనెలో దోరగా వేయించి తీసి ప్లేటులో ఉంచుకోవాలి. తర్వాత బియ్యం శుభ్రంగా కడిగి ఉంచుఓవాలి. ఓ పెద్ద పాత్ర స్టవ్‌పై పెట్టి అందులో ఎసరుకు సరిపడా నీరు పోయాలి. ఆ నీరు మరిగిన తర్వాత చెక్క, యాలకులు, లవంగాలు, ఉప్పు వేసి, ఆపైన కడిగి ఉంచుకున్న బియ్యం కూడా వేసి, రెండు నిమిషాలు మాత్రమే ఉడికించి రంధ్రాలు ఉన్న పాత్రలోగాని లేదా బట్టలోగాని పోసి వడగట్టాలి. నీరంతా పోయిన తర్వాత ఆ బియ్యాన్ని చికెన్‌ ఉన్న పాత్రలో సమతలంగా ఒక పొరలాగ పోయాలి. దీనిపైన వేయించి ఉంచిన ఉల్లిపాయలు మరో పొరలాగ పోయాలి. మళ్ళీ కొద్దిగా బియ్యం, ఆపైన ఉల్లిపాయలు.. అవి అయిపోయే వరకు ఇలా పొరలు పొరలుగా పోసి ఉల్లిపాయలు వేయించగా మిగిలిన నూనెను పాత్ర అంతటా కలిసేలా పోయాలి. తర్వాత లెమన్‌ కలర్‌ను కాసిని పాలలో కలిపి పాత్రలో అక్కడక్కడ బియ్యంపై పోయాలి. గోధుమ పిండిని ముద్దగా చేసి దీన్ని పాత్ర చివర్ల చుట్టూ అంటించి మూతను గట్టిగా బిగించి స్టవ్‌పై ఉంచాలి. అయిదు నిమిషాలపాటు పెద్ద మంటపై ఉంచి, మళ్ళీ మంటను తగ్గించాలి. 20-25 నిమిషాలపాటు ఉడికించిన తర్వాత బిర్యానీ పాత్ర నుంచి పొగలు రావడం మొదలవుతుంది. మూత తెరిచి పొడవాటి గరిటెతో పాత్ర అడుగున ఉన్న చికెన్‌ ముక్కను బయటికి తీసి ఉడికిందో లేదో చూడాలి. చికెన్‌ ముక్క మెత్తగా ఉడికినట్లయితే హైదరాబాదీ ధమ్‌ బిర్యానీ తయారైనట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!