Self Employment

ఎప్పటికి డిమాండ్ తగ్గని ఎవర్ గ్రీన్ బిజినెస్ అంటే ఇదే | కేవలం లక్షతో స్టార్ట్ చేయవచ్చు

Picsart 02 20 04.52.20
Mallikarjuna
Written by Mallikarjuna

ఫ్లై యాష్ బ్రిక్స్…. సాంప్రదాయక ఇటుకలు, మోడ్రన్ బ్రిక్స్ రాళ్లతో పోలిస్తే ఈ మధ్యకాలంలో వీటికి బాగా డిమాండ్ పెరుగుతోంది. తక్కువ సమయంలో పెద్ద పెద్ద భవనాలను తక్కువ మంది కూలీలతో నిర్మించడానికి ఇవి ఉపయోగపడుతూ ఉండడంతో కాంట్రాక్టర్లు , బిల్డర్లు కూడా నిర్మాణాల కోసం వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. అందుకే ఈ రోజుల్లో ఇటుకల కు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా గా నడుస్తోంది. సో ఈ ఫ్లై యాష్ బ్రిక్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎంత పెట్టుబడి కావాలి, ఎలా ప్రారంభించాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆదాయం ఎంత వస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలా తయారు చేస్తారు. : ఫ్లై యాష్ బ్రిక్స్ ని పవర్ ప్లాంట్స్ నుండి సేకరించిన బూడిద, సిమెంట్, రాతిదూలి మిశ్రమంతో తయారు చేస్తారు. ఇటుకల తయారీకి ఉపయోగించే మాన్యువల్ యంత్రాన్ని వంద గజాల స్థలంలో సౌకర్యవంతంగా అమర్చుకోవచ్చు. అందువల్ల ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. యంత్రాన్ని నడపడానికి ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు అవసరమవుతారు.

పెట్టుబడి ఎంత: ఈ వ్యాపారం ప్రారంభించాలంటే బ్రిక్స్ తయారు చేసే మెషిన్ కి కానీ, వర్కర్లకు కానీ, ఇతర ఖర్చుల కోసం కానీ కనీసం అంటే కనీసం రెండు లక్షల రూపాయల పెట్టుబడి ఉంటే చాలు. అలాగే వంద గజాల స్థలం అవసరం ఉంటుంది. ఈ మాన్యువల్ మిషన్ తో రోజుకు దాదాపు మూడు వేల ఇటుకలు తయారవుతాయి. మీకు ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన సామర్థ్యం ఉంటే మీరు ఆటోమెటిక్ మెషిన్ ను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ మెషిన్ ధర 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

ఆటోమేటిక్ మిషన్ కి మాన్యువల్ మిషన్ కి తేడా : ఆటోమేటిక్ మెషిన్ ఒక గంటలో వెయ్యి ఇటుకలను తయారు చేస్తుంది. ముడిసరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు అంతా మిషన్ చేసుకుంటుంది. ఈ విధంగా మీరు ఒక నెలలో మూడు నుంచి నాలుగు లక్షల ఇటుకలను సులభంగా తయారు చేయవచ్చు . మ్యాన్యువల్ మిషన్ తో అయితే నెలకు 30,000 వరకు ఇటుకలను తయారు చేయొచ్చు. అయితే చిన్న వ్యాపారంగా మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం మాన్యువల్ మిషన్ సరిపోతుంది

లైసెన్స్ లు కావాలా : ఈ బిజినెస్ ప్రారంభించాలంటే కొన్ని లైసెన్సులు కూడా తీసుకోవాలి. MSME లైసెన్స్, జిఎస్టి రిజిస్ట్రేషన్ , షాప్ ఎస్టాబ్లిస్మెంట్ లైసెన్స్, ట్రేడ్ మార్క్, NOC లైసెన్స్ ఇవన్నీ కచ్చితంగా లోకల్ మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి.

లోన్ సదుపాయం ఉంటుందా : మీరు ఈ బిజినెస్ ని బ్యాంకుల నుండి రుణం తీసుకుని కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు . దాని కోసం ముందుగా మీ దగ్గరలో ఉండే బ్యాంక్ ని సంప్రదించండి. ఎస్సి, బిసి కార్పొరేషన్ ల నుండి కూడా రుణాలు అందుతాయి.

మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి : ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మట్టి లేని కారణంగా ఇటుకలు తయారు చేయడం లేదు. ఉత్తర ప్రదేశ్, హర్యానా, మరియు పంజాబ్ నుంచి ఇక్కడికి ఇటుకలు దిగుమతి అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో బూడిద, సిమెంట్, రాళ్ళతో తయారు చేసే ఇటుకలను ఈ ప్రాంతాల్లో విక్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మన ప్రాంతంలో కూడా బిల్డర్లు కాంట్రాక్టర్లు మేస్త్రి లతో కాంటాక్ట్స్ పెంచుకోవడం ద్వారా ఇక్కడే వీటిని మార్కెట్ చేసుకోవచ్చు

ఆదాయం ఎంత ఉంటుంది : ప్లేయర్స్ బ్రిక్స్ వ్యాపారం ద్వారా ప్రతి నెలా కనీసం ఒక లక్ష వరకు సంపాదించవచ్చు. సాధారణంగా మట్టి ఇటుకల ఖరీదు మార్కెట్లో ఆరు నుంచి ఎనిమిది రూపాయల వరకు ఉంటుంది . అదే ఫ్లై యాష్ బ్రిక్స్ ఖరీదు ఏడు నుంచి పది రూపాయల వరకు ఉంటుంది . దీనికయ్యే ఖర్చు తయారీ, మార్కెటింగ్, అన్ని కలుపుకుని ఒక్కో ఇటుకకు మూడు నుంచి ఐదు రూపాయల వరకు ఉంటుంది. ఇలా చూసుకుంటే నెలకు నాలుగు లక్షల ఇటుకలు ఉత్పత్తి చేయగలిగితే ఒక్కో ఇటుకపైనా కనీసం 5 రూపాయల లాభం వేసుకున్న నెలకు 20 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అదే మీరు మాన్యువల్ మిషన్ తో 30 వేల ఇటులనే ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేసుకున్న కూడా నెలకు ఒక లక్ష నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే బిజినెస్ లో కేవలం లాభాలే కాదు , అన్నీ సక్రమంగా పాటించకపోతే నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ బిజినెస్ లో ఉండే లాభనష్టాలను ముందుగా అంచనా వేసుకుని, మీ దగ్గరలో ఇలాంటి వ్యాపారం ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం మంచిది.

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!