Self Employment

Electrical Tape Making Business : ఎలక్ట్రికల్ టేప్ తయారీ లక్షల్లో ఆదాయం

మన ఇంట్లో విద్యుత్ కు సంబంధించిన చిన్న అంతరాయం ఏర్పడినా, ఇంట్లో విద్యుత్ గృహోపకరణాలను బిగించాల్సి వచ్చిన మనం వెంటనే ఎలక్ట్రీషియన్స్ దగ్గరకు పరుగులు పెడుతుంటాం. అయితే ఆ ఎలక్ట్రీషియన్స్ వాడే పరికరాలతో పాటు కామన్ గా వాడేది ఎలక్ట్రికల్ టేప్. విద్యుత్ వైర్ల‌ను క‌లిపాక వాటికి టేప్ చుడ‌తారు. దీనివలన ఎలక్ట్రికల్ టేపులకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రికల్ పని ఏదైనా సరే ఎలక్ట్రీషియన్స్ తప్పకుండా ఈ ఎలక్ట్రికల్ టేపులను వాడుతుంటారు. అంత డిమాండ్ ఉన్న ఈ ఎలక్ట్రికల్ టేప్ తయారీని కనుక స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకుంటే మనం లక్షల్లో ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశం ఉంది. చిన్న రూమ్‌లో కూడా ఈ బిజినెస్ మొదలు పెట్టొచ్చు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టి క్రమ క్రమంగా పెంచుకుంటే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే .. ఎంత పెట్టుబ‌డి పెట్టాలో.. ఏ మేర లాభాలు ఈ బిజినెస్‌లో వ‌స్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఇప్పటికే చాలా మంది ఎలక్ట్రికల్ టేప్ ని తయారు చేసి సప్లై చేస్తున్నారు కదా అని సందేహం రావచ్చు. కాని మనం కనుక రిటైల్ ఎలక్ట్రికల్ షాపుల వారికి, ఎలక్ట్రీషియన్స్ కు మిగతా సప్లయర్స్ అందించే ధరల కంటే తక్కువ ధరలకే అందించగలిగితే మన ప్రోడక్ట్ అనేది చాలా సులువుగా సేల్ అవుతుంది. పైగా ఎవరు ఏ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినా ఈ పద్ధతినే అనుసరిస్తుంటారు.

ఇక విషయానికి వస్తే ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి మనకి ఒక ఎలక్ట్రికల్ టేప్ మేకింగ్ మిషన్ మరియు ఎలక్ట్రికల్ టేప్ రోల్ అవసరం అవుతాయి. ఒక టేప్ రోల్ నుండి సుమారు 75 టేపులను తయారు చేయవచ్చు. ఇక ఈ మిషన్ ను ఆపరేట్ చేయడానికి ఒక వ్యక్తి సరిపోతాడు. తయారీ విషయానికి వస్తే మిషన్ మధ్యలో ఉన్న పైప్ కి టేప్ రోల్ ని ఫిక్స్ చేయాలి. ఆ తరువాత మిషన్ ని ఆపరేట్ చేస్తూ ఎలక్ట్రికల్ టేపులను కట్ చేయాలి. దీంతో మనకి ఎలక్ట్రికల్ టేపులు సిద్ధమైపోతాయి. మనం ఈ మిషన్ ద్వారా 15ఎంఎం మరియు 18 ఎంఎం సైజు గల టేపులను తయారుచేయవచ్చు.

ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి, ఖర్చులు మరియు లాభాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ వ్యాపారానికి అవసరమైన ఎలక్ట్రికల్ టేప్ మేకింగ్ మిషన్ ధర సుమారు ఒక లక్ష పదివేల వరకు ఉంటుంది. అలాగే రా మెటీరియల్ గా వాడే ఎలక్ట్రికల్ టేప్ రోల్ 300 రూపాయల వరకు ఉంటుంది. మనం తయారు చేసే టేపుల సంఖ్యను బట్టి మనకి ఎలక్ట్రికల్ రోల్స్ అవసరమవుతాయి.

ఇక ఈ బిజినెస్ లో ఖర్చులు మరియు లాభాల వివరాలు చూసినట్లయితే ఒక టేప్ తయారు చేయడానికి మనకి 3 రూపాయల ఖర్చు అవుతుంది. ఒక్కో టేప్ మీద మనం ఒక రూపాయి లాభం వేసుకుని 4 రూపాయలకు రిటైల్ షాప్ లో అమ్మవచ్చు. మనం కనుక రోజుకి 2000 టేపులను తయారుచేసి మార్కెటింగ్ చేయగలిగితే రోజుకి 2000, నెలకి 60,000 రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు.

ఈ వ్యాపారానికి అత్యంత ముఖ్యమైనది మార్కెటింగ్. ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రికల్ టేపులను సప్లై చేస్తున్నపటికీ వారు అందించే ధరల కంటే మనం రిటైలర్స్ కు తక్కువ ధరలకే అందించినట్లయితే మన ప్రొడక్ట్ అనేది సులభంగా సేల్ అవుతుంది. అయితే మార్కెటింగ్ ఏజెంట్స్ ని నియమించుకోవడం ఇంకా మంచిది. ఎలక్ట్రీషియన్స్ మరియు ఎలక్ట్రిక్ షాపుల వారితో టై అప్ పెట్టుకోవడం ద్వారా కూడా మన ప్రొడక్ట్ ని సులభంగా సేల్ చేయవచ్చు. చ‌క్క‌ని నాణ్య‌త‌, తగ్గింపు ధ‌ర‌కు టేపుల‌ను విక్రయిస్తే ఈ బిజినెస్‌లో మంచి లాభాలు పొంద‌వ‌చ్చు..!

సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి బిజినెస్ ఐడియా .! మరి ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించే ముందు తగిన పరిశోధన చేసి మీ ఏరియాలో ఈ బిజినెస్ ఎంతవరకు మార్కెటింగ్ కు అనువుగా ఉంటుందో, మీరు ఎంత వరకు బిజినెస్ చేయగలరు అన్న విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలను సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మల్లి కలుద్దాం అంతవరకూ సెలవు నమస్కారం.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!