20230601_113830

ఎటు చూసినా కూలిన ప్రాకారాలు శిధిలమైన బురుజులు ఒరిగిపోయిన రాతి గోడలు, అసమాన వారసత్వ సంపదను తనలో దాచుకుని హిందూ-ముస్లిం సంస్కృతికి చిహ్నంగా నిలుస్తున్న ఎలగందుల ఖిల్లా గురించి ఈ రోజు తెలుసుకుందాం

కరీంనగర్ జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో మానేరు నది ఒడ్డున ఎలగందుల గ్రామంలో ఉన్న కోటను ఎలగందుల ఖిల్లా అని పిలుస్తారు. గతంలో ఈ గ్రామాన్ని బహుధాన్య పురం అని ఎలగందుల అనే పేరుతో పిలిచేవారని ఈ గ్రామంలోని చింతామణి చెరువు వద్ద ఉన్న క్రీస్తుశకం 1202 నాటి శిలాశాసనం చెబుతోంది.

వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట పై 1195 సంవత్సరంలో మాధవ రాజు జైతుంగి అనే సామంతరాజు స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత 1295 నుంచి 1323 వరకు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ కోటకు సరికొత్త మెరుగులు దిద్దాడు.

అయితే 1323లో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి ఈ ఖిల్లా ను స్వాధీనపరుచుకున్నాడు.

తర్వాత 1523 లో కుతుబ్ షాహీ వంశస్తుడైన కుతుబ్ ఉల్ ముల్క్ ఈ ఖిల్లా ను చేజిక్కించు కున్నాడు.

అలా 1687లో ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు కుతుబ్-ఉల్-ముల్క్ ను ఓడించిన తర్వాత మొగల్ చక్రవర్తుల పాలనలోకి వెళ్ళింది. దాదాపు 39 సంవత్సరాల పాటు మొగలుల పాలనలో ఉన్న ఈ ఖిల్లా ను 1724 లు నిజాం రాజులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

కాకతీయుల కాలం నుంచి నిజాం చివరి నవాబు వరకూ అనేకమంది సామంత రాజుల ఏలుబడిలో ఎలగందుల ఖిల్లా దేదీప్యమానంగా అలరారింది

సుమారు రెండు వందల అడుగుల ఎత్తు రెండున్నర మైళ్ళ విస్తీర్ణంలో ఈ ఖిల్లా ఉంది.ఈ కోటకు సుమారు 25 అడుగుల ఎత్తైన ప్రవేశద్వారం ఉంటుంది. కోట లోపలి ప్రాకారాన్ని ఆనుకుని 12 అడుగుల లోతులో కోట చుట్టూ పెద్ద కందకం ఇప్పటికీ మనం చూడొచ్చు. ఈ కోటను పాలించే రాజులు ఈ కందకంలో వందల సంఖ్యలో మోసళ్ళను పెంచి శత్రువులు కోటలోకి రాకుండా కోటని రక్షించేవారు.

ఇక పైకి చేరుకోవడానికి రాతి శిలను తొలిచి మెట్లను నిర్మించిన తీరును, కోటలో మూలాలు తిరిగే ప్రదేశాల్లో ఒక్కో సైనికాధికారికి విడివిడిగా ఏర్పాటుచేసిన గదులు, ఒక వేళ శత్రువు కోట లోనికి ప్రవేశించిన తప్పించుకునీ బయటకు వెళ్లకుండా ఏర్పాటుచేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, కోట పైభాగాన నలుదిశలా ఫిరంగి దళాల ఏర్పాట్లు, నీటి కోసం నిర్మించిన కొలను, గుర్రాలను ఉంచే అశ్వశాల ఇలా ఈ కోటలో ప్రతి భాగం కాకతీయుల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది.

ఈ కోటలో మసీదుతోపాటు నరసింహ స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉండటం విశేషం.

ఈ గ్రామంలో ఎలగందుల ఖిల్లా తో పాటు చార్మినార్ తరహాలో ప్రజల కోసం ప్రత్యేకంగా నిర్మించిన దో మినార్, రాజుల కోసం నిర్మించిన మెట్ల భావి కూడా ఉంది.

అయితే 1905 వరకు ఎలగందుల జిల్లా కేంద్రంగా ఉండేది. కానీ అప్పటికి కిలేదారు కరీముద్దీన్ మానేరు నదికి ఉత్తర తీరంలొ కరీంనగర్ పట్టణం స్థాపించాడు 1905లో అప్పటి ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హైదరాబాద్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయగా 1905లో జిల్లా కేంద్రం ఎలగందుల నుంచి కరీంనగర్ కు మారింది

మరి ఈ ఖిల్లాను మీలో ఎంతమంది చూశారు కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!