మన భారతదేశంలో పండుగలు ఫంక్షన్ లు, ఉత్సవాలు ఎంతో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో ఈ మధ్యన డీజే ఈవెంట్ ను బాగా ఎక్కువగా ఎరేంజ్ చేస్తున్నారు. పల్లె పట్నం తేడా లేకుండా ఏ ఈవెంట్ లో అయినా ఈ డీజే సర్వసాధారణం అయిపోయింది. అందువలన ఈ డిజె సెటప్ బిజినెస్ ఎంతో ట్రెండీగా సాగుతుంది.
ప్రస్తుతం నైట్ పార్టిస్, యూత్ ఫెస్ట్స్, యూత్ పార్టీస్, స్కూల్ అండ్ కాలేజి పార్టిస్ లో గాని, కల్చరల్ ఆక్టివిటీస్ లో గాని, దేవి నవరాత్రుల్లో కానీ, గణేష్ నవరాత్రులు గాని, పెళ్లిళ్లకు గాని, బర్త్ డే ఈవెంట్స్ కు గాని, సంగీత్స్ లో గాని ఈ డీజె సెటప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందువలన ఈ డీజె సెటప్ బిజినెస్ ఎంతో లాభదాయకం. కాబట్టి ఈ బిజినెస్ ప్రారంభించి చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు. ఇక ఈ బిజినెస్ ను ఎలా ప్రారంభించాలో ఇప్పుడు ఒకసారి తీసుకుందాం.