Meeku Telusa

Charaka Samhita | చరక సంహిత అంటే ఏమిటి?

ఎవరికైనా జబ్బు చేస్తే పూర్వజన్మలో చేసిన పాపం వల్లే ఈ గతి పట్టింది అని అనుకునే కాలమది. అలాంటి టైంలో ఆ జబ్బు ఏంటి, మన శరీరం ఎలాంటిది, జబ్బు వస్తే ఎలా ఎదుర్కోవాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది ఇలా వైద్యం ఆరోగ్యానికి సంబంధించి పరిశోధన చేసి ఏకంగా ఒక పుస్తకం రాశాడు ఒక వ్యక్తి. అతడు ఓ వ్యక్తి కాదు శక్తి. ఇది అతిశయోక్తి కాదు నిజం ఆయనే ఆచార్య చరక.

కనిష్కుని కాలంలో అంటే రెండో శతాబ్దం లో చరక రాజ వైద్యుడిగా ఉండేవాడు

విద్య వైద్యానికి కనిష్కుడు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో వివిధ ప్రాంతాలనుంచి ఎందరో విద్యార్థులు చరకుడి దగ్గర వైద్య విద్యను అభ్యసించేవారు ఆ సమయంలో రాసిందే ఈ చరక సంహిత.

నేటి వైద్యవిద్యకు కూడా ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండే ఈ పుస్తకాన్ని తన పూర్వీకులు అగ్నివేశ, మరియు ఆత్రేయలు రాసిన గ్రంథాల ఆధారంగా వ్రాశాడు.

ఆ కాలంలో గ్రామాల్లో తిరుగుతూ అందరికీ వైద్యం అందించడం వల్ల చరకుడికి ఆ పేరు వచ్చింది చరక అంటే సంస్కృతంలో తిరిగేవాడు, లేదా సన్యాసి అని అర్థం.

గ్రామాల్లో తిరుగుతూ వైద్యం చేసే వాళ్ళని కూడా చరక అని ఆ కాలంలో సంభోదించే వారని తెలుస్తోంది. ఆయనకు పేరు కూడా అలా వచ్చిందనేది చరిత్రకారులు చెబుతున్నారు.ఇక ఈ పుస్తకం విషయానికి వస్తే చారకుడు ఇందులో వివిధ అంశాలను 120 చాప్టర్లు 8 పుస్తకాలు గా విభజించారు.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

సూత్ర స్థాన, విధాన స్థాన, విమాన స్థాన, శరీర స్థాన, ఇంద్రియ స్థాన, చికిత్స స్థాన, కల్ప స్థాన, సిద్ది స్థాన అనేవి ఆ ఎనిమిది పుస్తకాలు.

సూత్ర స్థాన గ్రంధంలో 30 Chapter లు ఉంటాయి. ఇందులో వైద్యానికి సంబంధించి ముఖ్యమైన సూత్రాలు అర్థాలు ఆరోగ్యకరమైన జీవనం గురించి చరకుడు వివరించాడు.

విధాన స్థాన గ్రంథం లో ఉన్న 8 చాప్టర్ లలో మహమ్మరులు, అంటువ్యాధులు సహా వివిధ రకాల జబ్బుల గురించి ఉంటాయి.

విమాన స్థానంలో ఓ వైద్యుడికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి వైద్యంలో పాటించాల్సిన నైతిక విలువలు, వ్యాధుల లక్షణాలు, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, డైటింగ్, ఔషధాల తయారీ మొదలైన విషయాలు ఉంటాయి.

శరీర స్థానంలో ఉన్న 8 చాప్టర్లో అనాటమీ, గర్భంలో శిశువు వృద్ధి చెందే విధానం, మానవ శరీర వ్యవస్థ తో పాటు ఇతర జీవరాసుల గురించి కూడా చరకుడు వివరంగా రాశాడు.

ఇక ఇంద్రియ స్థానంలో 12 చాప్టర్లు ఉన్నాయి ఇందులో ఇంద్రియాల ద్వారా వ్యాధిని గుర్తించే పద్ధతులు, ఆ తర్వాత రోగి ఆరోగ్య స్థితిని పరిశీలించడం మొదలైన వివరాలను పొందుపరిచాడు

ఆరవ గ్రంధం అయిన చికిత్స స్థాన లో వివిధ రకాల జబ్బులకు సంబంధించిన చికిత్సా విధానం గురించి 30 చాప్టర్లు వివరణ ఉంటుంది.

కల్పన స్థాన లో ఔషధాల తయారీ, రోగికి ఎంత డోస్లో మందులు ఇవ్వాలి విషం ఎక్కితే ఎలా నయం చేయాలి, ఈ ఔషధాలు డోసేజ్ ఎక్కువ అయితే ఎలా గుర్తించాలి. ఇలాంటి వివరాలు ఉంటాయి.

ఆఖరిది సిద్ధి స్థాన… ఇందులో రోగికి జబ్బు నయమైనట్లు ఎలా గుర్తించాలి, స్వచ్ఛత, ఆరోగ్యకరమైన జీవనం గురించి ఉంటుంది,

అయితే ఈ చరకసంహిత గ్రంధాన్ని పూర్తిగా ఆచార్య చరకుడు రాయలేదని ఇందులోని చికిత్స స్థాన లో ఉన్న 17 చాప్టర్లు సహా కల్ప స్థాన, సిద్ద స్థాన గ్రంధాలను పూర్తిగా ధ్రిద బాల అనే మరో వ్యక్తి రాశారని చరిత్రకారులు చెబుతున్నారు.

చరకుడు చనిపోయిన తర్వాత చరక సంహిత లోని అనేక భాగాలు అంతరించిపోయాయి. దీంతో పుస్తక కాలం 5వ శతాబ్దానికి చెందిన ధ్రిద బాల ఈ చరకసంహిత ను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాడు అని చరిత్ర కారులు చెబుతున్నారు. సుదీర్ఘ పరిశోధనలు అనంతరం పూర్వపు శైలిలోనే ధ్రిద బాల చరక సంహితను పూర్తిచేశాడు

ఆయుర్వేద నిపుణులు ఎప్పటికీ ఈ చరక సంహిత గ్రంధాన్ని ఒక టెక్స్ట్ బుక్ గా పరిగణిస్తారు.

మన భారత దేశానికి మన సంప్రదాయానికి సంబంధించిన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు గర్వించదగ్గ విషయాలు. అందుకే అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికి మేరా భారత్ మహాన్….జైహింద్.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!