maxresdefault

2023 జూలై 14 తెల్లవారు జాము 02:35 నిముషాలు ఇది చంద్రయాన్ 3 చంద్రుడిపైకి వెళ్లేందుకు శాస్త్రవేత్తలు నిర్ణయించిన ముహూర్తం . అసలు చంద్రయాన్ త్రీ కి ఇదే కరెక్ట్ టైమ్ అని పరిశోధకులు ఎలా నిర్ణయించారు. మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు.

సాధారణంగా చంద్ర గమనం ఆధారంగా శుభకార్యాలకు ముహూర్తం పెడతారు, చంద్రయాన్ త్రీ కూడా చంద్రుని గమనాన్ని బేస్ చేసుకుని ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మీరు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక కదులుతున్న బస్సును ఎక్కాలి అంటేమీకు, బస్సుకు మధ్య ఉన్న దూరం బస్సు ఎంత వేగంగా ప్రయాణించింది మీరు ఎంత వేగంగా పరిగెత్తితే ఆ బస్సును అందుకోగలరు. ఇలాంటివన్నీ పరిగణలోకి వస్తాయి.

చంద్రుడు కూడా కదులుతూ ఉంటాయి కాబట్టి, చంద్రుడి వేగాన్ని పరిగణలోకి తీసుకుంటారు. చంద్రయాన్ తో పంపిస్తున్న ల్యాండ్ రోవర్ చంద్రుడిపై సూర్యకాంతి ఉన్నప్పుడే పనిచేస్తాయి కాబట్టి అవి ల్యాండ్ అయ్యే సమయానికి చంద్రుడిపై సూర్యకాంతి ఉండటం చాలా ముఖ్యం. చంద్రుడిపై ఒకరోజు అంటే భూమి మీద నెల రోజులు, చంద్రుడిపై ఒక పగలు అంటే ఇక్కడ 14 రోజులు ఇవన్నీ కలెక్ట్ చేసుకుని రాకెట్ ని ఎప్పుడు లాంచ్ చేస్తే కరెక్ట్ గా ల్యాండ్ అవుతుంది అనేది అంచనా వేసి ఇస్రో ఈ ముహూర్తం ఫిక్స్ చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!