Picsart_23-07-07_06-39-51-524

చాణిక్యుడు ధనానందుడి రాజ్యాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో మారు వేషంలో అక్కడి నుండి పరారయ్యాడు. తన ప్రయత్నం ఎందుకు విఫలమైందని ఆలోచిస్తూ చాణిక్యుడు తిరుగుతుండగా…ఒక ఊరిలో ఓ సాధారణ మహిళ తన కొడుకుని తిడుతూ ఉండడం గమనించాడు.

ఆ తల్లి ఒక పాత్రలో ఆహారం ఇస్తే కొడుకు ఆ పాత్ర చివర పట్టుకోకుండా… మధ్య భాగం పైన చేయివేసి ఆ పిల్లవాడు చేయి కాల్చుకున్నాడు. దీంతో తల్లి ఆ బాలుడిపై కోప్పడుతుంది. ఏం చేస్తున్నావ్ ఆ తెలివి తక్కువ చాణక్యుడు చంద్రగుప్తుడు కలిసి సరిహద్దు గ్రామాలను ఆక్రమించకుండా నేరుగా రాజధానిపై దండెత్తినట్లు పాత్ర అంచులు పెట్టుకోకుండా మధ్య భాగం పైన చేయి వేసి చెయ్యి కాల్చుకుంటావ్.. అని ఆ తల్లి కొడుకు పై కసురుకుంది

ఈ మాటలు విన్న చాణిక్య చంద్రగుప్తలు మొత్తం తమ తప్పు ఏంటో తెలుసుకున్నారూ. మరోసారి సైన్యాన్ని సమకూర్చి సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించడం మొదలుపెట్టారు. ఈసారి చంద్రగుప్తునికి పర్వతక అనే రాజు అండగా నిలిచాడు. రాజ్యం ఆక్రమించాక అర్థ రాజ్యం ఇచ్చేందుకు పర్వతకుడితో చాణిక్యుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా క్రమంగా పర్వతకుడు, చంద్రగుప్తుడు , చాణిక్యుడు సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించసాగారు. ఈ క్రమంలోవీళ్ళకి ఒక నగరం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చంద్రగుప్తున్ని రాజుగా ఆ ప్రాంత వాసులు అంగీకరించలేదు. దీంతో ఆ నగరాన్ని ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిశ్చయించుకొన్న చాణిక్యుడు… ఓ సాధువు వేషంలో ఆ నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న ఒక ఆలయంలో సప్తమాతృకల విగ్రహాలు ను తొలగిస్తే ప్రస్తుతం ఆ నగరం పై జరుగుతున్న దాడులు ఆగిపోతాయని నగరం మళ్లీ ప్రశాంతంగా మారుతుంది అని చెప్తాడు చాణక్యుడు. మారువేషంలో ఉన్న చాణిక్యుడి మాటలు నమ్మిన అక్కడివారు ఆ విగ్రహాన్ని తొలగిస్తారు. నగరం బయటకు వచ్చిన చాణిక్యుడు దాడులను ఆపమని తమ సైన్యాన్ని ఆదేశిస్తాడు. సాధువు చెప్పిన మాటలు నిజం కావడంతో ఆ నగర వాసులంతా విజయోత్సాహంతో సంబరాల్లో మునిగితేలుతారు.

అలా నగరవాసులు ఏమరుపాటుగా ఉండడం గమనించిన చాణిక్యుడు తన పథకం ప్రకారం ఆ నగరం పై ఆకస్మికంగా దాడి చేశాడు. దీంతో ఆ నగరం కూడా చంద్రగుప్తుడి వశమైంది. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న చాణిక్యుడు ఒక వూరిని ఏకంగా తగలబెట్టించాడని చరిత్రకారులు చెబుతారు.

గతంలో ఆ గ్రామస్తులు చాణక్యున్ని ఎంతో అవమానించారని… ఆకలితో అలమటిస్తున్న పిడికెడు అన్నం కూడా పెట్టలేదని.. అందుకే చాణిక్యుడు అలా ఆ గ్రామం పై పగ తీర్చుకున్నాడు అని అంటారు

ఇక ఇలా ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ చివరకు రాజధాని పాటలీపుత్ర అంటే ఇప్పుడు మనం పాట్నా గా పిలుస్హుకునే నగరం పైకి మరోసారి దండెత్తాడు

ఈసారి ధననందుడు సైన్యం ఓటమి పాలవగా ధననందుడిని చంద్రగుప్తుడు అంతమొందించాడు. ఇలా తన పగ సాధించిన చాణిక్యుడు నూతన సామ్రాజ్యం నిర్మాణంపై దృష్టి పెట్టాడు. ధననందుడు రహస్యంగా దాచి పెట్టిన నిధులను కనిపెట్టే పనిని చాణక్యుడు కొందరు జాలర్లకు అప్పగిస్తాడు. వారు ఆ నిధి ని కనిపెట్టి అది ఎక్కడుందో చాణిక్యుడి చెప్పగానే ఆ నిధి రహస్యం మరెవరికీ తెలియకూడదని వారిని చంపేస్తాడు చాణక్యుడు.

మరోవైపు ధననందుడిని అంతం తర్వాత అతని దగ్గర మంత్రిగా పనిచేసే రాక్షస అనే పేరు కలవాడు పరారవుతాడు. ధనందుడికి విధేయుడు కావడంవల్ల రాక్షస చంద్రగుప్తుడు పాలను వ్యతిరేకిస్తాడు. పరారీలో ఉంటూనే చంద్రగుప్తుని అంతం చేసేందుకు పన్నాగాలు పన్నేవాడు. ఈ క్రమంలో చంద్రగుప్తుడి దగ్గరకు విషకన్య పంపాలని పథకం వేస్తాడు రాక్షసుడు. అప్పట్లో ఎవరినైనా రహస్యంగా మట్టుబెట్టేందుకు ఈ విష కన్యలను వాడేవారట. తమ అందాలతో అవతలి వారిని కట్టిపడేసి ఆ వ్యక్తికి తెలియకుండానే విషమిచ్చి చంపడం ఈ విషకన్యల పని. అందుకే గుట్టుచప్పుడు కాకుండా హత్యలు చేయాలంటే అప్పట్లో ఎక్కువగా ఈ విషకన్యలను ఉపయోగించేవారు. అలాంటి ప్రమాదకర విషకన్య సాయంతో చంద్రగుప్తుని అంతం చేయాలని అనుకున్నాడు రాక్షసుడు.

ఆ విషయం తెలుసుకున్న చాణిక్యుడు ఆ వచ్చిన విషకన్యను చంద్రగుప్తుడికి సాయం చేసి అర్ధ రాజ్యం దక్కించుకున్న పర్వతకుడి దగ్గరకి పంపిస్తాడు. విషకన్య కారణంగా ఆ పర్వతకుడు ప్రాణాలు కోల్పోతాడు. పర్వతుడు మృతిపై అతని కుమారుడు మాల్యకేతు చాణుక్యుని ప్రశ్నించగా ఆ నేరం రాక్షసుడు మీదకు నెడతాడు. విషకన్యను రాక్షసుడే పంపాడని అతని వల్ల పర్వతకుడు ప్రాణాలు కోల్పోయాడని మాల్యకేతును నమ్మిస్తాడు. ఆ తర్వాత మాల్యకేతుకి నిజం తెలియడంతో అతను రాక్షసుడితో చేతులు కలుపుతాడు. మాల్యకేతు వెంట అతని స్నేహితుడు భావురాయున ఆయన కూడా వెళ్తాడు. మాల్యకేతుకి తెలియని విషయం ఏంటంటే తన వెంట మిత్రుడిగా ఉంటున్న భావురాయున నిజానికి చాణిక్యుడు నియమించిన గూడచారి. మాల్యకేతు ప్రతి కదలికను కనిపెడుతూ ఉండమని ఆయనను నియమించాడు చాణిక్యుడు. ఆతర్వాత రాక్షసుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాణిక్యుడు వాటిని పటాపంచలు చేస్తున్నాడు. మరోవైపు పర్వతకుడి అతని రాజ్యానికి పర్వతకుడి సోదరుడు వైరోధక పట్టాభిషిక్తుడయ్యాడు

రాక్షసుడే పర్వతకుడి మరణానికి కారణమని నమ్మించి చాణిక్యుడు గతంలో హామీ ఇచ్చినట్లే అర్ధ రాజ్యాన్ని వైరోధకుడికి ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆ తర్వాత పాతలిపుత్ర ప్రధాన శిల్పిని కలిసి చంద్రగుప్తుడి ఊరేగింపుకు స్వాగతం పలికే విధంగా కోట వెలుపల ఒక భారీ తోరణం నిర్మించాలని చాణిక్యుడు కోరతాడు. గ్రహబలాల పేరుతో పగటిపూట జరగాల్సిన ఊరేగింపును అర్ధరాత్రికి వాయిదా వేస్తాడు చాణక్యుడు.

ధననందుడికి మాజీ మంత్రి , రాక్షసుడికి విధేయుడైన ప్రధాన శిల్పి చంద్రగుప్తుని చంపడానికి ఇది సరైన తరుణమని భావిస్తాడు ఉరేగింపు సమయంలో చంద్రగుప్తుడి పై తోరణం కూలిపోయేలాగా తోరణం ఏర్పాటు చేస్తాడు. అర్ధరాత్రి అందరూ అనుకున్నట్టుగా ఊరేగింపు వచ్చింది ప్రధాన శిల్పి పథకం ప్రకారం ఆ తోరణం ఏనుగు మీద ఊరేగుతున్న రాజుపై కూలింది. కానీ చనిపోయింది చంద్రగుప్తుడు కాదు అర్థ రాజ్యం పాలించేందుకు చాణిక్యుడి తో ఒప్పందం కుదుర్చుకున్న విరోధకుడి మీద ఆ తోరణం కూలి విరోధకుడు మరణించాడు.

ఎన్ని ఎత్తుగడలు ఎందుకంటే మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడు తప్ప మరో రాజు పాలించడం చాణక్యుడికి ఇష్టం లేదు . అందుకే పర్వతకుణ్ణి చంపినట్లే అతని సోదరుడు విరోధకుడిని కూడా అంతం చేసేందుకు రహస్యంగా ఈ పథకం రచించాడు. ఇందుకు శత్రువులనే వాడుకున్నాడు. అర్ధరాత్రి ఊరేగింపు నిర్వహించడానికి కూడా ఇదే కారణం. చిమ్మచీకటిలో అంబారీ పై ఎవరు కూర్చున్నది స్పష్టంగా కనిపించదు. అలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాక చాణిక్యుడు విరోధకుడిని ఊరేగింపుకు ఆహ్వానిస్తాడు. అనుకున్నట్టుగానే విరోధకుడిని అంతం చేస్తాడు. మరోసారి ఈ నేరాన్ని రాక్షసుడి పైకి నెట్టేలా చేస్తాడు.

ఇలా ఎప్పటికప్పుడు చాణిక్యుడు శత్రువుల దాడులను ప్రతిఘటిస్తూ ఉన్న ఇంకా రాక్షసుడు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మాల్యకేతు అతడివైపు ఉండడం రాక్షసుడికి మరింత బలాన్ని చేకూర్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!