Picsart_23-07-06_21-55-35-434

ఎవరైనా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఊహించని విధంగా పావులు కదుపుతూ విజయం సాధిస్తుంటే అబ్బో వాడు అపర చాణిక్యుడు రా.. అంటారు. నిజానికి చాణిక్యుడు అంత తెలివైనవాడా అని అంటే అవుననే ఖచ్చితమైన సమాధానం చరిత్ర చెబుతోంది.

చాణిక్యుడి రాజ తంత్రం ముందు ఇప్పటి రాజకీయ నాయకులు ఎవరూ పనికిరారు. చాణక్యుడు ఎంత తెలివి గల వాడు అంటే ఓ సామ్రాజ్యాన్ని పడగొట్టి తన ప్రతీకారం సాధించేంత తెలివి గలవాడు. ఈ చాణక్యుడు ఎవరు? మౌర్య సామ్రాజ్య స్థాపనకు ఎలా కారకుడయ్యాడు? ఈ రోజు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

నిజానికి చాణిక్యుడి కథపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. బౌద్ధులు, జైనులు, కశ్మీరీలు, పర్షియన్ లతో పాటు విశాఖదత్త రచించిన ముద్రరాజసం అను గ్రంధము ను గ్రహించి వీటిలోని కొన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.

చాణిక్యుడు క్రీస్తుపూర్వం 375 వ సంవత్సరంలో జన్మించాడు. చాణిక్యుడు రచించిన అర్థశాస్త్రం ఆధారంగా చాణిక్యుడు అసలు పేరు విష్ణుగుప్త అని అతని గోత్రం ఆధారంగా చాణక్యుడు అనే పేరు వచ్చి ఉంటుందని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

చాణక్యుడికి చిన్నప్పుడు కోర దంతాలు ఉండేవట.ఇలా కోర దంతాలు ఉంటే ఆ పిల్లలు రాజభోగాలు అనుభవిస్తారు అని ఆ కాలంలో ఒక నమ్మకం ఉండేది. ఈ నమ్మకం వల్ల చాణిక్యుడి తల్లిలో ఆందోళన మొదలైంది. తన కొడుకు భవిష్యత్తులో రాజయితే ఇక తనను పట్టించుకోవడం మానేస్తాడు అని భావించిందట. తల్లి ఆందోళనను గమనించిన చాణిక్యుడు.. ఆమెను సముదాయించేందుకు తన కోర దంతాలను విరగకొట్టుకున్నాడట.. అంతేకాదు నిన్ను బాగా చూసుకుంటాను అమ్మా… అని తల్లికి హామీ ఇచ్చాడు.

బౌద్ధుల మహావంశ గ్రంథం ప్రకారం చాణక్యుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వేదాలు, రాజనీతి శాస్త్రంలో పట్టు సాధించాడు చాణిక్యుడు..

ఓసారి బ్రాహ్మణులకు మగధ సామ్రాజ్యం రాజు ధనానంద అనేక ధనం దానము చేస్తున్నాడు అని తెలిసి అతని సంస్థానానికి వెళ్తాడు. కానీ వంకర పాదాలు, విరిగిన దంతాలతో వికృతంగా ఉన్న చాణక్యున్ని చూసి ఆ రాజు అసహ్యించుకుంటాడు. అతన్ని వెంటనే బైటకు గెంటేయమని భటులను అదేశిస్తాడు. ఆ తోపులాట లో ఆతని సిగ ఉడిపోతుంది. దీంతో కోపోద్రిక్తుడైన చాణిక్యుడు ఉడిపోయిన సిగ తో రాజుని దూషిస్తాడు. అంతేకాదు పగ సాధించిన తర్వాతే తన శిఖను ముడి వేసుకుంటా అని శపధం చేస్తాడు. దీనినే చాణక్య శపదం అని కూడ అంటారు. దీంతో రాజు ఆదేశం మేరకు భటులు చాణిక్యుడిని బండిస్తారు.

కానీ అప్పటికే చాణిక్యుడు ధనానంద కుమారుడు పంపధ తో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. అతనికి పదవీ కాంక్ష చూపించడంతో చాణిక్యుడి మాటలు నమ్మి పంపధ అతన్ని రహస్యంగా విడిపిస్తాడు. దీంతో మారువేషంలో చాణిక్యుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆ తర్వాత వింధ్య పర్వత శ్రేణిలోని అడవిలోకెళ్ళి ధాతువాదం విశారదన్ పద్ధతిలో అంటే ఇనుమును బంగారంగా మార్చే రసాయన పద్ధతుల సాయంతో 80 కోట్ల బంగారు నాణాలని సృష్టించాడట.

తర్వాత ధర్మానంద సంస్థానంలో రాజుగా పరిపాలించే సామర్థ్యం గల వ్యక్తి కోసం గాలింపు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఓ రోజు చాణిక్యుడు దృష్టిని ఒక కుర్రాడు ఆకర్షించాడు. అతను తన స్నేహితులతో కలిసి రాజు ఆట ఆడుతున్నాడు. రాజుగా ఆదేశాలిస్తూ ఆ కుర్రాడు ధైర్యంగా మాట్లాడటం చాణిక్యుడి నచ్చింది. అతణ్ణి పరీక్ష చేద్దామని అతని దగ్గరికి వెళ్ళి దానం అడగ్గా అక్కడున్న ఆవులను తీసుకెళ్ళు నా మాటకి అడ్డు చెప్పే వాడు లేడు అని సమాధానమిచ్చాడట ఆ కుర్రవాడు. దీంతో ఆ బాలుడే ధనానంద స్థానాన్ని భర్తీ చేయడానికి సరైన వాడని చాణిక్యుడు నిశ్చయించుకున్నాడు. ఆ కుర్రాడే చంద్రగుప్త మౌర్య….

చాణిక్యుడు చంద్రగుప్తుడి పెంపుడు తండ్రికి 1000 బంగారు నాణేలు ఇచ్చి చంద్రగుప్తుడిని తన వెంట తీసుకు వెళ్తాడు. అలా చంద్రగుప్తున్ని వెంట తీసుకెళ్లిన చాణిక్యుడు అతడికి శిక్షణ ఇవ్వడం మొదలుపెడతాడు. చంద్రగుప్తుడి తో పాటు ధనానంద కుమారుడు… ఒకప్పుడు చాణిక్యుడు జైలు నుంచి పరారీ అయ్యేందుకు సహకరించిన పంపధ కూడా రాజ్యకాంక్షతో కౌటిల్యుడి దగ్గర శిక్షణ పొందుతాడు.

చంద్రగుప్తుడు పంపధ శిక్షణ లో సరిసమానంగా రాణించడంతో…ఓసారి చాణిక్యుడు వీరిద్దరికీ కఠిన పరీక్ష పెడతాడు. ఇద్దరి మెడలోను లాకెట్ తో ఉన్న నూలు తాడులను కడతాడు.

చంద్రగుప్తుడు నిద్రపోతున్నప్పుడు అతనికి ఏమాత్రం తెలియకుండా, తాడు తెగకుండా అతని మెడ నుంచి ఆ తాడు తీసివేయాలి అని పంపధకి పరీక్ష పెడతాడు చాణక్యుడు కానీ పంపధ ఆ పని చేయలేకపోతాడు.

మరోవైపు పంపధ నిద్ర పోయినప్పుడు అదే పరీక్షను చంద్రగుప్తునికి కూడా పెడతాడు. అయితే చంద్రగుప్తుడు వెంటనే పంపధ తల నరికేసి తాడును తీసుకుంటాడు. ఆ పరీక్షలో చంద్రగుప్తుడి తెగువను చూసిన చాణిక్యుడు ఆశ్చర్యపోతాడు. తర్వాత ఏడేళ్లపాటు చాణిక్యుడు అతనికి కఠిన శిక్షణ ఇస్తాడు.

చంద్రగుప్తుడు యుక్తవయసు వచ్చాక గతంలో తాను దాచిన బంగారు నాణేలను వెలికితీసి ఆ డబ్బుతో కొంత సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇదే సరైన తరుణం అనుకొని ధననందుడు పై దాడి చేస్తాడు. అయితే అంతటి మేధావి అయిన చాణిక్యుడి అంచనాలు కూడా ఇక్కడ తలకిందులయ్యాయి. ఆ యుద్ధంలో చాణిక్యుడు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. చంద్రగుప్తుడి తో కలిసి మారువేషంలో అక్కడినుంచి తప్పించుకున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!