ఎలుక తోలు, కుక్కతోక, తాబేలు వాసన, పంది బుద్ధి , చెడ్డ వ్యక్తి ఇవి జన్మలో మారవు
వివరణ :::
ఎలుక తోలు నల్లగా ఉంటుంది, ఆ తోలును ఎన్నిసార్లు ఎన్ని రకాల పదార్థాలతో ఉతికినా, నలుపు నుంచి తెల్లగా మారదు..
కుక్క తోక వంకర గానే ఉంటుంది. ఆ తోకను ఎంత ప్రయత్నించి కర్రలతో కట్టి ఉంచిన తిరిగి వంకరగానే మారిపోతుంది
తాబేలు పాచి తిని బతుకుతుంది. అందుకే దాని శరీరం నుంచి ఎప్పుడూ పాచి కంపు కొడుతూ ఉంటుంది. అది చనిపోయిన తర్వాత కూడా ఆ దుర్వాసన దాని శరీరం నుంచి పోదు.
పుట్టుకతోనే బురదలో దొర్లుతుంది పంది అషుద్దం తింటుంది. ఆ పందిని బురదలో నుంచి తీసి పన్నీటి పాన్పు లో పడుకోబెట్టినా, పంచభక్ష పరమాన్నాలు పెట్టినా, తిరిగి బురదలోకే వెళుతుంది. అశుద్ధ భోజనాన్ని ఆస్వాదిస్తుంది
సరిగ్గా అదే విధంగా చెడు ఆలోచనలతో మనసంతా నిండిన ఆ వ్యక్తిని, సన్మార్గం లోకి మళ్ళించడం అసాధ్యం. వారిని మంచి వారిగా మార్చి పదిమందికి ఉపయోగపడేలా మార్చడం ఆ పరంధాముని కి తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదనేది చాణక్యుడి నీతి సూత్రం