మనలో చాల మంది ఇంటి దగ్గర నుంచి కదలకుండా బిజినెస్ చెయ్యాలని అనుకుంటారు.. అయితే అలాంటి వారికి మంచి బిజినెస్ ఐడియా ఒకటి ఉంది.అదే పేపర్ ప్లేట్స్ తయారీ బిజినెస్
ప్రస్తుత కాలంలో పెళ్లిళ్ల కైనా, రిసెప్షన్ల కైనా, బర్త్ డే పార్టీలకైనా ఫంక్షన్ ఏదైనా సరే బఫె పద్దతిలో విందు ఇవ్వడం అనేది సర్వసాధారణం అయిపోయింది. సహజంగా ఈ బఫె పద్ధతిలో విందు ఇవ్వడానికి పేపర్ ప్లేట్లను ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించిన నేపథ్యంలో చాలామంది ప్లాస్టిక్ ను వాడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పేపర్ తో తయారు చేసే ప్లేట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందువలన వీటి అవసరాన్ని ఆదాయవనరుగా మలచుకుని లక్షల్లో డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. అలాగే పెద్దగా మ్యాన్‌పవర్ కూడా అవసరం ఉండదు
ఇక ఈ ప్లేట్ల తయారీ వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత , ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం
పేపర్ ప్లేట్ తయారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు పేపర్ ప్లేట్ తయారీ మిషన్ కావాలి. మిషన్ తో పాటు పేపర్ ప్లేట్ల తయారీకి అవసరమయ్యే మౌల్డ్స్ అంటే రౌండ్ టైప్ పేపర్ ప్లేట్ , స్క్వయిర్ టైపు పేపర్ ప్లేట్, ఇలా వివిధ రకాల డిజైన్స్ ఉన్న మౌల్డ్ అవసరం అవుతాయి. మిషన్ తో పాటు మనకు ర్రా మెటీరియల్ గా పేపర్ రోల్ అవసరం ఉంటుంది.
పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్‌కు పెద్దగా స్థలం అవసరం లేదు. ఇంట్లోనే ఈ మెషిన్లను పెట్టుకోవచ్చు. స్థలం లేని వారు చిన్నపాటి షెడ్లను లీజుకు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఈ మిషన్ సింగిల్ ఫేజ్ కరెంట్ తో పనిచేస్తుంది.
1000 పీసులు ఒక లాట్ అనుకుంటే 160000 పేపర్ ప్లేట్ లు 16 లాట్ లు అవుతాయి ఒక లాట్ 300 రూపాయల చొప్పున 16 లాట్ ల సేల్ పైన 4800 రూపాయలు ఒక రోజుకు సంపాదించుకోవచ్చు ఇలా నెలకు 1,40,000/- వరకు ఆదాయం వస్తుంది.
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | వాట్సాప్ గ్రూప్ లింక్ |
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి | టెలిగ్రామ్ గ్రూప్ లింక్ |