PicsArt_02-12-04.06.00

మనకి కొన్ని కొన్ని వ్యాపారాలు చిన్న చిన్నవిగా చులకనగా కనిపిస్తాయి. కానీ వాటి వల్ల వచ్చే లాభం చాలా బాగుంటుంది 

అయితే వ్యాపారంలో మొదటి సూత్రం తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం చేయడం. అలాంటి ఒక  బిజినెస్ ఐడియా నే  బనానా చిప్స్ తయారీ బిజినెస్

బంగాళా దుంపల చిప్స్ గురించి మనకు తెలుసు, క్రిస్పీగా బాగుంటాయి కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పాలి బనానా చిప్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆలు చిప్స్ లాగే అర‌టి పండు చిప్స్ కూడా రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి. అయితే ఆలు చిప్స్ వ‌ల్ల కొవ్వు బాగా పెరుగుతుంది.  అందువ‌ల్లే చాలా మంది ఆలు చిప్స్‌కు బ‌దులుగా అర‌టి పండు చిప్స్‌ను తింటున్నారు. ఆరోగ్య అలవాట్లు దృష్ట్యా ఈ రోజుల్లో ఎక్కువ మంది అలు చిప్స్ నుంచి బనానా చిప్స్ పైకి రుచిని మార్చుకుంటున్నారు . అందుకే ఇప్పుడు ఈ వ్యాపారం లాభాల పంట పండిస్తోంది. 

లాభం కావాలంటే మొదలు పెట్టాలిందే 

ప్రస్తుతం మార్కెట్లో బనానా చిప్స్ తయారు చేస్తున్న కంపెనీలు  చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ఇది మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు 

బనానా చిప్స్ తయారీ

బనానా చిప్స్ తయారీకి అవసరమైన మిషన్స్ విషయానికి వస్తె అరటి కాయలను కడగడానికి ట్యాంక్, అరటి చిప్స్ తయారీ కి అరటి తొక్కలు కొలిచే యంత్రం, అరటిని సన్నగా కట్ చేసే స్లసింగ్ మిషిన్, అరటి స్లైస్ నీ వేయించడానికి ఫ్రైయింగ్ మిషన్, తయారైన చిప్స్ కి మసాలాలు జత చేసి ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ చేసే యంత్రం కావాలి

ముడి పదార్థాలు గా ఊర అరటి, నూనె ఉప్పు కారం రకరకాల మసాలాలు అవసరమవుతాయి 

ఈ యంత్రాలు ఎక్కడ దొరుకుతాయి 

 బనానా చిప్స్ తయారీ యంత్రాల ధర 28 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది యంత్రాలను ఫిక్స్  చేసుకోవడానికి 500 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది ఈ యంత్రాలు మీకు  india.alibaba.com లేదా index.html వెబ్సైట్లలో కొనుగోలు చేయవచ్చు లేదా మీరు చేసిన రీసెర్చ్ ప్రకారం వేరే ఎక్కడైనా కొనుగోలు చేయండి

50కిలోల చిప్స్ కి ఎంత ఖర్చు అవుతుంది 

ఈ బిజినెస్ లో కర్చులు మరియు లాభాల వివరాలు చూసినట్లయితే 50 కేజీల బనానా చిప్స్ తయారు చేయాలంటే 120 కిలోల కూర అరటి కావాల్సి ఉంటుంది సీజన్ బట్టి ₹1000 అటు ఇటు గా ఉంటుంది వాటిని ఫ్రై చేసేందుకు 12 నుండి 15 లీటర్ల నూనె కావాలి దాని ధర వెయ్యి యాభై రూపాయల వరకు ఉంటుంది అలాగే యంత్రాలు పని చేయడానికి మీకు 10 నుంచి 11 లీటర్ల డీజిల్ కావాలి దాని ధర 1000 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలుపుకుని 150 నుంచి 200 రూపాయలు అవసరం అవుతుంది . ఈ మొత్తం ఖర్చులు అన్ని కలిపితే 50కేజీల బనానా చిప్స్ తయారీకి 3,200వరకు కర్చు అవుతుంది. 

అయితే  కేజీ అరటి చిప్స్ తయారు చేయడానికి మీకు అయ్యే ఖర్చును 60నుంచి 70రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ చిప్స్ ధర మార్కెట్లో బ్రాండ్ను బట్టి కిలో రెండు వందల నుంచి 350 వరకు పలుకుతోంది. ఈ లెక్కలో  మీరు తయారు చేసిన 50 కిలోల బానాన చిప్స్ కిలో 200 రూపాయలకు అమ్మిన పెట్టుబడికి లోకి 70 రూపాయలు తీసేస్తే 130 రూపాయలు లాభం అంటే 50 కిలోల చిప్స్ x 130 = 6500 లాభం అన్నమాట.

మార్కెటింగ్ విషయానికి ఈ బననా చిప్స్ ను  మన పట్టణం లో స్వీట్ షాపుల వారికీ, బేకరీ షాపుల వారికీ, మరియు హోటల్ లకు, సూపర్ మార్కెట్ లవారికి అలాగే మీ పట్టణంలో ఉండే బార్లు, రెస్టారెంట్లు, వారితో మాట్లాడుకుని వారికి మంచి క్వాలిటీ తో రుచిగా తక్కువ ధరకే సప్లై చేయగలిగితే ఈ వ్యాపారం తో నెలకు 60 నుంచి 70 వేల రూపాయల వరకు కచ్చితంగా సంపాదించొచ్చు ఇక ఈ బిజినెస్ ఐడియా మీ అవగాహన కోసం మాత్రమే. దీనిపై పూర్తి విశ్లేషణ చేసి మీ సొంత నిర్ణయం తీసుకోగలరు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!