maxresdefault

ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ భారీగా లాభాలు వస్తూ ఉండటంతో స్థలాల కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఖాళీ స్థలం ఎక్కడ ఉన్నా దాన్ని ఇతరులు అక్రమించు కోకుండా ఉండేందుకు పూర్వ కాలంలో ప్రహరిని నిర్మించే వారు. దీని కోసం సిమెంట్, ఇసుక, ఇటుకలు, కూలీలకు చాలా డబ్బు ఖర్చు అయ్యేది. ఆ తర్వాత కాలంలో ఫెన్సింగ్ రావడంతో చాలా మంది తమ కాళీ స్థలాలకు ఫెన్సింగ్ వాడే వారు. కానీ ఫెన్సింగ్ గోడ అంత సురక్షితం కాదు. ఇతరులు, పశువులు సులభంగా ఫెన్సింగ్ దాటుకుని వెళ్లగలవు. అయితే అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వినియోగం చాలా విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నిర్మాణ రంగంలో కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ ఆవిష్కరణలు సమయాన్ని, డబ్బుని, శ్రమని ఆదా చేస్తున్నాయి. అలాంటి ఒక బెస్ట్ ఆవిష్కరణే రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్.

ఇటుకలతో నిర్మించిన గోడ లాగే ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ కూడా మంచి రక్షణగా నిలుస్తాయి. ఇవి చూడటానికి అందంగా ఉండటంతో పాటు ఇన్ స్టాల్ చేయడం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. వీటికి ఎలాంటి పూత అవసరం లేదు. ముఖ్యంగా ఈ కాంపౌండ్ వాల్స్ ను ఖాళీ స్థలాలు, టెంపరేరి బిల్డింగ్స్ కు, హాస్పిటల్స్ ప్రభుత్వ కార్యాలయాలుకు, ఇతర నిర్మాణాలలో ఎంతో ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి మనకి సిమెంట్, ఇసుక, ఐరన్ రాడ్, ఐరన్ మోల్డ్స్, వర్కర్స్ మరియు ఖాళీ స్థలం, షెడ్డు కావాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ బిజినెస్ ప్రారంభించడానికి సుమారు 5 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది.

ఇక తయారీ విధానం చూసినట్లయితే ముందు గా మౌల్డ్స్ లలో ముందుగా సిమెంట్, ఇసుక ను సమపాళ్లలో కలిపి ఒక లేయర్ లాగా వేయాలి. తరువాత 4ఎం ఎం ఐరన్ రాడ్ లను మ్యాట్ లాగా పరవాలి. తరువాత ఇసుక , సిమెంట్ కలిపిన మాల్ ను వేసుకుని మౌల్డ్ అంత సమంగా వచ్చే సిద్ధంగా తాపీతో రుద్దాలి. అలా ఒక రోజంతా మౌల్డ్ లో వుంచి బయటకు తీసిన తరువాత కనీసం మూడు రోజుల పాటు నీటితో తడపాలి. అలాగే ఈ వాల్స్ నిలబెట్టడానికి అవసరమైన పిల్లర్లు కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. . రెడీ మేడ్ కాంపౌండ్ వాల్స్ తయారీ కొరకు ఇప్పటికే ఈ బిజినెస్ లో ఉన్నవారి దగ్గర నేర్చుకోవచ్చు.

ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్ బిజినెస్ లో లాభాల వివరాలు చూసినట్లయితే ఒక చదరపు అడుగు మార్కెట్లో 100 నుండి120 రూపాయల మధ్య నడుస్తోంది. ఈ బిజినెస్ లో అన్ని ఖర్చులు పోను 30 శాతం నుండి 40 శాతం వరకు లాభాలు ఉంటాయి. అంటే మీరు నెలకు 2 లక్షల రూపాయల బిజినెస్ చేస్తే 80 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ప్రస్తుతం నిర్మాణ రంగం దూసుకుపోతుంది కాబట్టి నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నందువల్ల ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం అనేది పెద్ద కష్టమేమీ కాదు.

ఈ బిజినెస్ కు మార్కెటింగ్ ఎంతో కీలకం. మనం నిర్మాణ కాంట్రాక్టర్స్ తో, కనస్ట్రక్షన్ కంపెనీస్ తో వారితో కాంటాక్ట్ అవ్వొచ్చు. అలా చేస్తే మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మనం మన పట్టణంలో బాగా ప్రచారం చేసుకోవాలి.

సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి బిజినెస్ ఐడియా. ఇటువంటి వ్యాపారాలను ప్రారంభించే ముందు ఈ బిజినెస్ గురించి పూర్తి అవగాహన ఆ తరువాత మాత్రమే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించు కోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియా తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!