సహజంగా ఎవరైనా ఏదో ఒక బిజినెస్ ప్రారంభించాలంటే దానికి పబ్లిసిటీ అనేది చాలా అవసరం. ఉదాహరణకు మన పట్టణంలో ఏదో ఒక బట్టల షాపు గాని బంగారం షాపు గాని ప్రారంభించినట్లయితే దాని గురించి అందరికీ తెలియపరచాలి. దీనికోసం పట్టణంలో పబ్లిసిటీ చేస్తూ ఉంటాం. సిటీ కేబుల్లో యాడ్ ఇవ్వడం గాని లేదా ఆటోలలో మైక్స్ పెట్టి ప్రచారం చేయడం గాని చేస్తుంటాం. ఇదే తరహాలో మనం కూడా ఒక ట్రావెలింగ్ యాడ్ ఏజెన్సీని ప్రారంభించినట్లయితే చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు.
ఈ బిజినెస్ ను మనం రెండు విధాలుగా చేయవచ్చు. సైకిల్స్ ద్వారా యాడ్స్ ప్రచారం చేయడం గానీ వర్కర్స్ ద్వారా స్టాండింగ్ యాడ్స్ ను ప్రచారం చేయడం గాని చేయాలి. దీనికోసం మనకి వర్కర్స్ కావాల్సి ఉంటుంది. ప్రారంభంలో దాదాపుగా ఒక ఆరుగురు వర్కర్స్ ను నియమించుకుంటే సరిపోతుంది.