ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన కేబినెట్ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ , ఆర్టీసీ కానిస్టేబుల్, కండక్టర్, డ్రైవర్, అసిస్టెంట్ మెకానిక్ మొత్తం 1168 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉద్యోగాలు కేవలం కారుణ్య నియామకాల క్రింద చేపట్టనున్నారు.
- కడప సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్ లో ఉద్యోగాలు
- కడప సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉద్యోగాలు
- ఒక ఆడది తన బాధలు నీతో చెప్పింది అంటే | Motivational Words Telugu
- Manchi Matalu Telugu #1 | Motivational Words Telugu
- Tirumala Facts | తిరుమల శ్రీవారి గర్భాలయంలో విగ్రహాల రహస్యాలు
ఈ మేరకు కడప జిల్లాలో ఖాళీగా ఉన్న 142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆర్టీసీలో కారుణ్య నియా మకాలకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాల పరిధిలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి గోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కడప, ప్రొద్దుటూరు. పులివెందుల, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి డిపోల్లో పనిచేస్తూ మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
జూనియర్ అసిస్టెంట్ – 03
ఆర్టీసీ కానిస్టేబుళ్లు – 14
డ్రైవర్ – 52
శ్రామిక్, సహాయ మెకానిక్ – 73
అర్హతలు : మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఎవరైనా, ఏదైనా ఉద్యోగ నియామకానికి సిద్ధంగా ఉన్నామని నోటరీ చేసిన అఫిడవిట్ అందజేయా లని, తహసీల్దారు జారీ చేసిన ధ్రువపత్రం, ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం చేయలేదని ధ్రువపత్రం సమ ర్పించాలన్నారు. దరఖాస్తులకు ఆర్టీసీ కార్యాలయంలో సంప్రదిం చాలన్నారు. పూర్తి వివరాలకు 99592 25773 నంబరును సంప్రదించాలని సూచించారు.
![]() | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |
Apsrtc recruitment మొత్తం ఒక link lo update చేయండి sir.only kadapa district మాత్రమే ఇచ్చారు. మేము సత్యసాయి district ఇక్కడ డ్రైవర్ recruitment ఉన్నాయా లేదా అన్నది మాకు ఎలా తెలుసుకోవాలి sir