Andhra Pradesh

AP Teacher Jobs || ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో టీచర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఉన్న పాఠశాల విద్యా శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా 05 జూన్ 2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో పనిచేయడానికి మొత్తం 1358 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1358 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో ప్రిన్సిపల్ 92 పోస్టులు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ 846 పోస్టులు సి ఆర్ టి 374 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హతలు

ప్రిన్సిపల్ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థులకు కనీసం 50% మార్కులతో బీఈడీ మరియు పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు బిఈడి లేదా బీటెక్ లేదా బిఎస్సి లేదా ఎంబిబిఎస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా లేదా ఎంఏ లేదా ఎంకం లేదా ఎంఎస్సీ లేదా ఎంబీఏ పాసై ఉండాలి.

సి ఆర్ టి ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థులకు బీఈడీతో పాటు బ్యాచులర్ డిగ్రీ పాసై ఉండాలి.

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు అండర్ గ్రాడ్యుయేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా బిపిఈడి లేదా ఎంపీడీ గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి

వయసు పరిమితి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు జనరల్ కేటగిరి అభ్యర్థులు అయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మాజీ సైనిక ఉద్యోగ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు సడలింపు ఉంటుంది .

ఎంపిక విధానము ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు మొత్తం వంద మార్కులకు సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ మరియు బిఈడి లో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీస్ వెయిటేజీ స్కిల్ టెస్ట్ లో ప్రతిభా ఆధారంగా మార్కులను కేటాయించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానము ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే మహిళ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ కస్తూర్బా గాంధీ విద్యాలయం యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ముఖ్యమైన తేదీల వివరాలు

ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమయ్యే తేదీ 30 మే 2023

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 5 జూన్ 2023

www.apkgbv.apcfss.in

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!