1. రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి గురించి వివరణ ఎక్కడ ఉంది?
1) 5వ భాగం, ఆర్టికల్స్ 63 నుంచి 70
2) 5వ భాగం, ఆర్టికల్స్ 63 నుంచి 72
3) 5వ భాగం, ఆర్టికల్స్ 64 నుంచి 73
4) 5వ భాగం, ఆర్టికల్స్ 63 నుంచి 73
2. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) కేంద్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు.
బి) భారత రాజ్యాంగం ఆయనకు రాష్ట్రపతి తర్వాత హోదా కల్పించింది.
సి) అమెరికా ఉపాధ్యక్ష పదవి స్ఫూర్తిగా రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు.
డి) 1954 నుంచి ఈ పదవి కొనసాగుతోంది.
1) ఏ,బి, సి
2) ఏ,సి,డి
3) ఏ,బి, డి
4) ఏ,బి,సి,డి
3. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతను గుర్తించండి.
ఎ) భారతదేశ పౌరుడై ఉండాలి.
బి) 35 సంవత్సరాల వయసు ఉండాలి.
సి) రాజ్యసభకు ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలు ఉండాలి.
డి) కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవిలో ఉండరాదు.
1) ఏ,బి, డి
2) ఏ,సి,డి
3) ఏ,బి,సి
4) ఏ,బి,సి,డి
4. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఓటర్లుగా ఎవరు ఉంటారు?
ఎ) పార్లమెంటు ఉభయసభల మొత్తం సభ్యులు.
బి) పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన సభ్యులు.
సి) రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు.
డి) రాష్ట్రాల శాసనమండలి సభ్యులు.
1) ఏ,సి
2) ఏ, బి,సి
3) ఎ మాత్రమే
4) బి, సి
5. రాజ్యసభకు వదవీరీత్యా ఎవరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు?
1) రాజ్యసభ సభ్యులు ఎన్నుకున్న చైర్మన్.
2) ఉపరాష్ట్రపతి
3) పార్లమెంటులోని సీనియర్ నాయకుడు.
4) రాష్ట్రపతి
6. కింది వాటిలో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) పదవిని స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
బి) పదవీకాలం కంటే ముందే రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించవచ్చు.
సి) ఉపరాష్ట్రపతి పదవీకాలం ఆరు సంవత్సరాలు.
డి) ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభకు తాత్కాలిక చైర్మన్గా గా వ్యవహరిస్తారు.
1) 2, ໖, ໖
2) 2, 3, 4
3) 2, ໖,
4) 2, 2, 3, 4
7. పార్లమెంటు ఉభయసభల సభ్యులతో ఏర్పడిన ఎలక్ట్రోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రతిని ఎన్నుకునే విధానాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?
1) 1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951
2) 6వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956
3) 9వ రాజ్యాంగ సవరణ చట్టం, 1961
4) 11వ రాజ్యాంగ సవరణ చట్టం, 1962
8. కింది వాటిలో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు.
బి) ఉపరాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని మనదేశ తొలి ఉపరా ష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రవేశపెట్టారు.
సి) ప్రస్తుతం ఈ పదవిని రెండు సార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయం కొనసాగుతోంది.
డి) ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టు విచారిస్తుంది.
1) ఏ,బి,డి
2) ఏ,సి,డి
3) ఏ, బి,సి
4) ఏ, బి,సి,డి
9. కింది వాటిలో ఉపరాష్ట్రపతి వేతనానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) రాజ్యసభ చైర్మన్ హోదాలో వేతనం పొందుతారు.
బి) వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది.
సి) భారత సంఘటిత నిధి నుంచి నెలకు రూ. 4 లక్షలు పొందుతారు.
డి) వేతనంపై ఆదాయపు పన్ను ఉంటుంది.
1) ఏ,బి,డి
2) ఏ,సి,డి
3) ఏ,బి,సి
4) ఏ,బి,సి,డి
10. రాజ్యాంగంలోని ఆర్టికల్ 69 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? *
1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
2) రాష్ట్రపతి
3) ప్రధానమంత్రి
4) రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్
11. కింది వాటిలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సందర్భానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండీ.
ఎ) రాష్ట్రపతి మరణం, రాజీనామా, తొలగింపు, వేరే కారణాల వల్ల ఆ పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు
బి) రాష్ట్రపతి అనారోగ్యం, మరే ఇతర కారణంతోనైనా తాత్కాలికంగా విధులకు హాజరు కాలేని పక్షంలో
సి) రాష్ట్రపతి దీర్ఘకాలిక విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో
డి) ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ, రాజ్యసభకు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు.
1) ఏ,బి,సి
2) ఏ,సి,డి
3) ఏ,బి,డి
4) ఏ, బి,సి,డి
12. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేం దుకు ఎవరి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయాలి?
1) ప్రధానమంత్రి
2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) రాష్ట్రపతి
4) కంప్రోలర్, ఆడిటర్ జనరల్ (సీఏజీ)
13. మనదేశంలో ఇప్పటివరకు రెండుసార్లు ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించిన వారెవరు?
1) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, బైరాన్ సింగ్ షెకావత్
2) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, హమీద్ అన్సారీ
3) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, కె. కృష్ణకాంత్
4) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్
14. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతికి ఉండే అధికార, విధులను గుర్తించండి.
ఎ) రాజ్యసభ సమావేశాల నిర్వహణకు అవసరమైన కోరం 1/10వ వంతును ధ్రువీకరిస్తారు.
బి) పార్టీ ఫిరాయింపులకు పాల్పడే రాజ్యసభ సభ్యుల అనర్హతలను ప్రకటిస్తారు.
సి) రాజ్యసభలో ఏదైనా బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష హోదాలో నిర్ణాయకపు ఓటు వినియోగించుకుని బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.
డి) సభాసమావేశాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సభా నియమాలను ఉల్లంఘించిన సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
1) ఏ,బి,సి
2) ఏ,బి,డి
3) ఏ,సి,డి
4) ఏ,బి,సి,డి
15. ఆర్టికల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి?
1) లోక్సభ
2) పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా
3) రాజ్యసభ
4) పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం
16. మనదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఏకకాలంలో ఏ సంవత్సరంలో ఖాళీ ఏర్పడింది?
1) 1969
2) 1971
3) 1975
4) 1980
17. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని 14 రోజుల ముందస్తు నోటీసుతో, ఎంతమంది సభ్యుల సంతకాలతో సంబంధిత సభలో ప్రవేశపెట్టాలి?
1) 1/3 వ వంతు
2) 2/3 వ వంతు
3) 1/4 వ వంతు
4) 1/2 వ వంతు
18. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు తొలగించే తీర్మానానికి అవసరమైన మెజార్టీని గుర్తించండి.
1) సాధారణ మెజార్టీ
2) ద్విపక్ష మెజార్టీ
3) 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ
4) 1/4వ వంతు మెజార్టీ
19. జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం భారత్, సోవియట్ రష్యాల మధ్య సామరస్య సంబంధాల పెంపుదలకు ఏ ఉపరాష్ట్రపతి సేవలను వినియోగించుకుంది?
1) జాకీర్ హుస్సేన్
2) జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
3) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
4) ఫకృద్దీన్ అలీ అహ్మద్
20. కిందివారిలో ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించి, తదుపరి రాష్ట్రపతులుగా ఎన్నికైన వారిని గుర్తించండి.
ఎ) జాకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకటగిరి
బి) ఆర్.వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ
సి) కె.ఆర్.నారాయణన్
డి) బైరాన్ సింగ్ షెకావత్, వి.వి.గిరి
1) ఏ,సి,డి
2) ఏ,బి,సి
3) ఏ,బి,డి
4) ఏ,బి,సి,డి
21. కింద పేర్కొన్న ఉపరాష్ట్రపతులను వారు నిర్వహించిన పదవీకాలం ఆధారంగా వరుస క్రమానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఏ) వి వి గిరి
బి) బి డి జెట్టి
సి) కె.ఆర్. నారాయణన్
డి) జి.ఎస్.పాఠక్
1) ఏ,డి,బి,సి
2) ఏ,సి,డి,బి
3) ఏ,బి,సి,డి
4) బి,సి,డి, ఏ
22. భారతదేశంలో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ఒక సభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరు?
1) రాష్ట్రపతి
3) ప్రధానమంత్రి
2) ఉపరాష్ట్రపతి
4) అటార్నీ జనరల్
23. ప్రస్తుత భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు?
1) వెంకయ్య నాయుడు
2) జగదీప్ ధనఖడ్
3) కృష్ణకాంత్
4) హమీద్ అన్సారీ
24. మనదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ ఎవరు వ్యవహరిస్తారు?
1) ఉపరాష్ట్రపతి
2) కేంద్ర కేబినెట్ కార్యదర్శి
3) రాష్ట్రపతి
4) ప్రధానమంత్రి
25. కింది వాటిలో ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకునే విధానాన్ని గుర్తించండి.
1) ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పద్ధతి
2) నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి
3) నైష్పత్తిక బహుళ ఓటు బదిలీ పద్ధతి
4) నైష్పత్తిక ఏక ఓటు బదిలీ పద్ధతి
26. ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి, రాష్ట్రపతి పదవికి పోటీచేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి?
1) కృష్ణకాంత్
2) ఆర్. వెంకట్రామన్
3) బైరాన్ సింగ్ షెకావత్
4) వెంకయ్యనాయుడు
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి