ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మంగళగిరిలో ఉన్న టెలి మానస్ ప్రాజెక్ట్ లో పని చేయడానికి అర్హులయిన అభ్యర్థుల నుండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు కేవలం కాంట్రాక్ట్ పద్దతిలో మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎంపికయిన అభ్యర్థులు మంగళగిరిలో ఉన్న టెలి మానస్ ప్రాజెక్ట్ లో 11 నెలల కాలానికి కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయాలి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 08 డిసెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఈ ఇంటర్వ్యూ డిసెంబర్ 13వతేది ఎయిమ్స్ మంగళగిరిలో జరుగుతుంది. వివరాల కోసం క్రింద ఇచ్చిన సమాచారం చదవగలరు.
సంస్థ పేరు : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 05 పోస్టులు
ఉద్యోగాల వివరాలు :
1) అసిస్టెంట్ ప్రొఫెసర్ / సీనియర్ కన్సల్టెంట్ - 01 పోస్టు
2) సీనియర్ రెసిడెంట్ / కన్సల్టెంట్ - 01 పోస్ట్
3) క్లినికల్ సైకాలజిస్ట్ / సోషల్ వర్కర్ / నర్స్ - 01 పోస్ట్
4) టెక్నికల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ - 01 పోస్ట్
5) డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01 పోస్టు
విద్యార్హతలు :
1) అసిస్టెంట్ ప్రొఫెసర్ / సీనియర్ కన్సల్టెంట్ - సైక్రియాట్రిలో ఎండి లేదా సమన అర్హతలు ఉండాలి .
2) సీనియర్ రెసిడెంట్ / కన్సల్టెంట్ - సైక్రియాట్రిలో ఎండి లేదా సమన అర్హతలు ఉండాలి .
3) క్లినికల్ సైకాలజిస్ట్ / సోషల్ వర్కర్ / నర్స్ - నర్సింగ్ లో ఎం ఎస్సి లేదా క్లినికల్ సైకాలజీ
4) టెక్నికల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ - బీఈ లేదా ఎంసిఎ లేదా సంబంధింత రంగంలో డిప్లొమా ఇంజనీరింగ్
5) డేటా ఎంట్రీ ఆపరేటర్ - డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్
వయసు : పైన తెలిపిన ఉద్యోగాలకు అన్నింటికీ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు 45 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 13 వతేదీన మంగళగిరి ఎయిమ్స్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం : అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేఉకోవాలి . దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 08 డిసెంబర్ 2024
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి