భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 20 నవంబర్ 2024 నుండి 10 డిసెంబర్ 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు ,బెంగళూరు , అంబాలా, జోధాపూర్, బటిండా, ముంబై,వైజాగ్, ఢిల్లీ , ఘజియాబాద్, మరియు ఇండోర్ లలో పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
ఉద్యోగం పేరు : ఫిక్సడ్ టెనూర్ ఇంజనీర్
మొత్తం ఖాళీల సంఖ్య : 299 పోస్టులు
విభాగాల వివరాలు : ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్
అర్హతలు : అభ్యర్థులు సంబంధిత విభాగాలలో BE/B.Tech/B.Sc ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి,
వయసు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01 నవంబర్ 2024 వ తేదీ నాటికి 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ ల ప్రకారం వయసు పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి
ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షా బెంగుళూరులో నిర్వహిస్తారు. అందులో పాస్ అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ కేటగిరి, ఓబిసి అభ్యర్థులు 472 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సి, ఎస్టీ, వికలాంగ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
దరకాస్తు విధానం : ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2024.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి