సంతూర్.. సంతూర్ … టీవీలలో ఈ సంస్థ అడ్వేర్టైజ్మెంట్ చూసే ఉంటారు. ప్రముఖ సంస్థ అయినటువంటి విప్రో సంస్థ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఆర్థికంగా , సామాజికంగా వెనుకబడిన మహిళా విద్యార్థినులకు చేయుట అందించడం కోసం 2016 నుండి స్కాలర్ షిప్ విధానం అమలు చేస్తోంది. సంవత్సరానికి 24,000 రూపాయల స్కాలర్ షిప్ ను అందిస్తూ వారు ఉన్నత విద్యను అభ్యసించాలని ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
అర్హతలు : మీ పిల్లలు కూడా ఈ స్కాలర్ షిప్ పొందాలి అంటే కొన్ని ముఖ్యమైన అంశాలు కలిగి ఉండాలి. అవి అభ్యర్థులు 10 వతరగతిని ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ ను కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మాత్రమే పూర్తి చేసుకుని ఉండాలి. మరియు స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకునే సమయానికి విద్యార్థులు 3 సంవత్సరాల డిగ్రీ కోర్స్ కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే ఈ స్కాలర్ షిప్ పొందడానికి అర్హులు.
అవసరమైన డాకుమెంట్స్ : సంతూర్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఆధార్, డిగ్రీ కాలేజీ ఐడి కార్డు, పది మరియు ఇంటర్ యొక్క మార్క్ లిస్ట్స్, అలాగే బ్యాంక్ పాస్ బుక్ కాపీ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా విద్యార్థినులు ఈ సంతూర్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.