ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కడప జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి కార్యాలయం నుండి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 17-09-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు : మహిళా శిశు సంక్షేమ శాఖ, కడప
ఉద్యోగం పేరు : అంగన్వాడీ ఉద్యోగాలు
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 74 పోస్టులు
ఉద్యోగాల వివరాలు :
అంగన్వాడీ కార్యకర్త : 11 పోస్టులు
అంగన్వాడీ సహాయకురాలు : 59 పోస్టులు
మినీ అంగన్వాడీ కార్యకర్త : 04 పోస్టులు
విద్యార్హతలు : దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి., ఆంగవాడి కార్యకర్త ఉద్యోగాలకు 10వతరగతి పాస్ అయి ఉండాలి, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగానికి 7వతరగతి పాస్ అయి ఉండాలి.
వయసు : 18 సంవత్సరాల నుండి 35 ఏళ్లలోపు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ ప్రదేశం : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం, కడప
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ : 17-09-2024
ఇంటర్వ్యూ తేదీ : 28-09-2024